కింగ్స్ కు తలవంచిన లయన్స్
► దినేష్ కార్తీక్ (58) పోరాటం వృథా
► కింగ్స్ పంజాబ్ స్కోరు 188/7, గుజరాత్ లయన్స్ 162/7
రాజ్ కోట్: కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ సమిష్టి ప్రదర్శనతో గుజరాత్ లయన్స్ పై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బౌలర్ల కట్టు దిట్టంగా బౌలింగ్ చేయడంతో లయన్స్ బ్యాట్స్ మెన్స్ చేతులేత్తేశారు. గత నాలుగు మ్యాచుల్లో వరుసగా ఓడిన పంజాబ్ తాజా విజయంతో ఓటముల ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని కాపాడుకో లేకపోయిన పంజాబ్ గుజరాత్ తో మాత్రం సమిష్టిగా రాణించి విజయం సాధించింది. ఇక కొల్ కతా పై గెలిచి ఊపు మీదున్న గుజరాత్ లయన్స్ కు బ్యాట్స్ మెన్స్ విఫలమవ్వడంతో మరో ఓటమి తప్పలేదు.
189 పరుగుల పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ లయన్స్ కు ఆదిలోనే ఓపెనర్ మెకల్లమ్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత రైనా ఆరోన్ ఫించ్ తో ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేసినా పంజాబ్ బౌలర్ల దాడికి విఫలమైంది. ఆరోన్ ఫించ్ అవుటైనా రైనా దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ 2 వికెట్లు కోల్పోయి 50 పరుగులు చేసింది. ఆ వెంటే రైనా అక్సర్ పటేల్ బౌలింగ్ భారీ షాట్ కు ప్రయత్నించి అవుటయ్యాడు. అనంతరం వచ్చిన లయన్స్ బ్యాట్స్ మెన్స్ క్రీజులో ఎక్కువసేపు నిలవలేక పోయారు. జడేజా, స్మిత్, ఆదిత్యా నాథ్ లు సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. గుజరాత్ బౌలర్ కరియప్ప వరుస బంతుల్లో స్మిత్, ఆదిత్యా నాథ్ లను అవుట్ చేయడంతో గుజరాత్ 106 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది.
ఒక వైపు వికెట్లు పడుతున్న దినేష్ కార్తీక్ ఆండ్రూ తైతో కలసి పోరాటం కొనసాగించాడు. ఈ దశలో 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తోడుగా నిలిచిన ఆండ్రూ తై (22) ను సందీప్ శర్మను అవుట్ చేయడంతో మ్యాచ్ పంజాబ్ చేతిలోకి వచ్చింది. చివర్లో12 బంతుల్లో 40 కొట్టాల్సిండగా బసీల్ ధంపీ నుంచి సహాకారం అందక పోవడంతో లయన్స్ కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్ కు 36 పరుగుల కావల్సి ఉండగా లయన్స్ 9 పరుగులు మాత్రం చేయగలిగింది. పంజాబ్ బౌలర్లలో అక్సర్ పటేల్, కరియప్ప, సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కగా, మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. అంతకు ముందు బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఆమ్లా మెరుపులకు మాక్స్ వెల్ తొడవ్వడం, ఆఖరి ఓవర్లో అక్షర్ పటేల్ దూకుడు తో 7 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ చేసిన ఆమ్లా కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.