లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ అదరగొడుతోంది. ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (134; 17 ఫోర్లు, 2 సిక్సర్లు), షాయ్ హోప్ (147 బ్యాటింగ్; 23 ఫోర్లు) శతకాలతో చెలరేగారు. దాంతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 329 పరుగులు చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది.