
కైనన్ జంటకు కాంస్యం
అస్తానా: ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ షూటర్ కైనన్ షెనాయ్ రెండో పతకాన్ని సాధించాడు. కజకిస్తాన్‌లో అస్తానాలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం మిక్స్‌డ్ టీమ్ ట్రాప్ ఈవెంట్‌లో తన భాగస్వామి శ్రేయసి సింగ్‌తో కలిసి కైనన్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. కాంస్య పతక పోటీలో కైనన్–శ్రేయసి జంట 40–38తో లెబనాన్ జోడీపై గెలిచింది. మంగళవారం ట్రాప్ వ్యక్తిగత విభాగంలో కైనన్‌కు కాంస్యం లభించిన సంగతి తెలిసిందే.