కొలంబో : ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో చివరి లీగ్ మ్యాచ్‌కు ఎప్పుడో కాని ప్రాధాన్యం ఉండదు. ‘నిదహస్ ట్రోఫీ’లో శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ ఆఖరి లీగ్ మ్యాచ్ మాత్రం ఆసక్తికరంగా మారింది. మూడు విజయాలతో భారత్ ఫైనల్‌కు చేరిపోవడం, మిగతా రెండు జట్ల ఖాతాలో ఒక్కొక్క గెలుపే ఉండటంతో ఈ పోరు ‘సెమీ ఫైనల్’ తరహాగా మారింది. దీంతో ఈసారి పైచేయి ఆతిథ్య శ్రీలంకదా? ఇప్పటికే ఒకసారి ఆ జట్టును ఓడించిన బంగ్లాదేశ్‌దా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ విజేత ఆదివారం జరిగే తుది సమరంలో టీమిండియాను ఎదుర్కోనుంది. ఆడుతున్నది స్వదేశంలో, పైగా స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న టోర్నీ. ఈ కారణాల రీత్యా బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో లంకపైనే ఎక్కువ ఒత్తిడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment