ఇటానగర్: దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన అరుణాచల్ ప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ సాంబా లాపంగ్ను ఆ రాష్ట్ర గవర్నర్ జేపీ రాజ్ ఖోవా సత్కరించారు. లాపంగ్ కు రూ. రూ.10 లక్షల నజరానా అందజేయడంతో పాటు, ఒక ప్రశంస పత్రాన్ని ఇచ్చి సత్కరించారు. 'నీవు త్వరలో జరిగే ఒలింపిక్స్ లో కూడా పతకాన్ని సాధిస్తావనే నమ్మకం ఉంది. ఒలింపిక్స్ లో భారత కీర్తిని సగర్వంగా చాటిచెప్పు. దాంతో పాటు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని నిలబెట్టు' అని గవర్నర్ ఆకాంక్షించారు.
రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారుకు కొదవలేదని గవర్నర్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. సరైన శిక్షణ, చక్కటి మార్గదర్శకత్వం, సహకారం అందిస్తుండటమే తమ రాష్ట్రం నుంచి అత్యధిక శాతం క్రీడాకారులు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారని పేర్కొన్నారు.