అక్లాండ్: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఈ ప్రభావం క్రీడా రంగంపై భారీగానే పడింది. ఇప్పటికే పలు టోర్నీలు రద్దు కాగా మరికొన్ని టోర్నీలు వాయిదా పడ్డాయి. దీంతో క్షణం తీరికలేకుండా ఉండే ఆటగాళ్లు ఇంటికే పరిమితమయ్యారు. ఈ అనూహ్యంగా దొరికిన సమయాన్ని పలువురు క్రికెటర్లు తమ కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా గడుపుతున్నారు. అంతేకాకుండా వీలు చిక్కినప్పుడల్లా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ జేమ్స్ నీషమ్ సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లాక్‌డౌన్ సమయంలో తన పెంపుడు కుక్కతో సరదాగా ఆడుకుంటున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు నీషమ్. ఎంతో ఫన్నీగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక గతంలో కూడా తన పెంపుడు కుక్కకు స్లిప్‌లో క్యాచ్‌లు ఎలా పట్టాలో నీషమ్ ట్రైనింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తరుపున 12 టెస్టులు, 63వన్డేలు, 18 టీ20లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ అనతికాలంలోనే జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు.
చదవండి:
ధోని.. ఈరోజు నీది కాదు!
'ఆరోజు హర్భజన్‌ను కొట్టడానికి రూమ్‌కు వెళ్లా'
Comments
Please login to add a commentAdd a comment