
చెన్నైతో మ్యాచ్‌లో కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్
కోల్‌కతా : కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో ఓటమి జట్టుకు చెంపదెబ్బ లాంటిదని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించారు. జట్టు మొత్తం ఘోరంగా విఫలమైందని చెప్పడానికి మ్యాచ్‌లో ఫీల్డింగ్ ఒక్కదాన్ని పరిశీలిస్తే సరిపోతుందని చెప్పారు. ఫీల్డింగ్‌లో లోటుపాట్లు ఉన్నాయని తమకు ముందే తెలుసునని, అవి ఇప్పుడు బయటపడ్డాయని తెలిపారు.
సునీల్ నరైన్ వరుసగా ఇచ్చిన రెండు క్యాచ్‌లను జడేజా వదలిపెట్టడం ఇందుకు మచ్చుతునక అని చెప్పారు. ఆఖరు ఓవర్లలో చెన్నై పరుగుల వేగం కొంచెం మందగించిందని తెలిపారు. డెత్ ఓవర్లలో జడేజా ఒక బంతికి ఒకటి కంటే ఎక్కువ పరుగులు సాధించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. కేకేఆర్ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారని కితాబిచ్చారు. స్లాగ్ ఓవర్లలో కోల్‌కతా స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేసి చెన్నై పరుగులను నియంత్రించడంలో విజయం సాధించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment