'ధోనికి బౌలింగ్ చేయనని చెప్పా' | Mahendra Singh Dhoni is one of the nicest guys I have met: Imran Tahir | Sakshi
Sakshi News home page

'ధోనికి బౌలింగ్ చేయనని చెప్పా'

Published Fri, Apr 7 2017 6:58 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

'ధోనికి బౌలింగ్ చేయనని చెప్పా'

'ధోనికి బౌలింగ్ చేయనని చెప్పా'

పుణె: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంటే తనకు విపరీతమైన అభిమాని అంటున్నాడు దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 వ సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు ఆడుతున్న తాహీర్.. తన సహచర ఆటగాడు ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.

 

'నేను ఇప్పటివరకూ కలిసిన ఉన్నతమైన వ్యక్తుల్లో ధోని ఒకడు. ఎప్పుడూ కూల్ గా ఉంటూ భారత్ క్రికెట్ కు అనే విజయాలు సాధించాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. నాకు అతనిచ్చే సలహాలు చాలా విలువైనవి. నేను ధోని నుంచి చాలా సలహాలు తీసుకున్నాను. అవి నా కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ ఐపీఎల్లో ధోనితో కలిసి ఆడుతున్నానని తెలిసిన తరువాత ఉద్వేగానికి లోనయ్యా'అని తాహీర్ తెలిపాడు. కాగా, నెట్ ప్రాక్టీస్ లో ధోనికి బౌలింగ్ చేయడాన్నిఎంజాయ్ చేయనని తాహీర్ తెలిపాడు. ఇదే విషయాన్ని ధోనికి చెప్పినట్లు ఈ నంబర్ వన్ వన్డే బౌలర్ పేర్కొన్నాడు. అందుకు కారణాన్ని కూడా వెల్లడించాడు. ఒకవేళ తాను బౌలింగ్ చేసిన పక్షంలో ధోని నుంచి కొన్ని సిక్సర్లను చూడాల్సి రావడం ఖాయమన్నాడు.  ధోని చేత బాదించుకోవడం ఇష్టంలేకనే అతనికి నెట్స్ లో బౌలింగ్ చేయడానికి దూరంగా ఉంటున్నట్లు తాహీర్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement