tahir
-
దురదృష్టం అంటే నీదే భయ్యా.. పాపం ఎవరికీ ఈ కష్టం రాకూడదు!
పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్‌లో భాగంగా డిసెంబర్2న అబోటాబాద్, సియాల్కోట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సియాల్కోట్ ఓపెనర్, పాక్ యువ బ్యాటర్ మీర్జా తాహిర్‌ను దురదృష్టం వెంటాడింది. ఎవరూ ఊహించని విధంగా హిట్‌వికెట్‌గా తాహిర్ వెనుదిరిగాడు. ఏం జరిగిందంటే..? సియాల్కోట్ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ యాసిర్ షా బౌలింగ్‌లో తాహిర్ బ్యాక్ ఫుట్‌లో నుంచి పుల్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు వెనుక్కి వెళ్లి షాట్ ఆడే క్రమంలో అతడి బరువు బ్యాక్‌ఫుట్‌పై పడింది. దీంతో ఒక్కసారిగా తాహిర్ కుడి కాలి కండరాలు పట్టేసాయి. ఈ క్రమంలో నొప్పితో విల్లావిల్లాడిన అతడు బ్యాలెన్స్ కోల్పోయి స్టంప్స్‌పై పడిపోయాడు. దీంతో 38 పరుగులు చేసిన తహిర్ హిట్‌వికెట్‌గా నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బ్యాడ్ లక్ అంటే నీదే బ్రో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సియాల్కోట్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. సియాల్కోట్ బ్యాటర్లలో తాహిర్‌దే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అనంతరం 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో అబోటాబాద్ ఛేదించింది. చదవండి: భారత్‌కు తిరిగి వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. వీడియో వైరల్ Mirza Tahir Baig had a bizarre and unfortunate end to his stay at the crease 😳#NationalT20 | #ABTvSKT | #AajaMaidanMein pic.twitter.com/XdB0uXP4Jb — Pakistan Cricket (@TheRealPCB) December 2, 2023 -
తాహిర్ తడాఖా
కోల్‌కతా: అనుభవజ్ఞులతో నిండిన చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో అదరగొట్టింది. ఐపీఎల్–12 సీజన్లో ఏడో విజయాన్ని నమోదు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 161 పరుగులు చేసింది. తొలుత కోల్‌కతా ఓపెనర్ క్రిస్ లిన్ (51 బంతుల్లో 82; 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) కదంతొక్కగా... 40 ఏళ్ల ఇమ్రాన్ తాహిర్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి కోల్‌కతాను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాడు. అనంతరం చెన్నై జట్టు 19.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 162 పరుగులు చేసి గెలిచింది. సురేశ్ రైనా (42 బంతుల్లో 58 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్), రవీంద్ర జడేజా (17 బంతుల్లో 31 నాటౌట్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడి చెన్నై విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. చివరి 2 ఓవర్లలో చెన్నై విజయం కోసం 24 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో హ్యారీ గుర్నె వేసిన 19వ ఓవర్లో తొలి బంతికి రైనా సింగిల్ తీశాడు. ఆ తర్వాత జడేజా వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో చెన్నై ఈ ఓవర్లో మొత్తం 16 పరుగులు సాధించింది. ఇక చివరి ఓవర్లో గెలుపు కోసం చెన్నై 8 పరుగులు చేయాల్సి ఉండగా... చావ్లా వేసిన ఈ ఓవర్ తొలి బంతిని జడేజా బౌండరీ దాటించాడు. ఆ తర్వాత మిగతా లాంఛనాన్ని పూర్తి చేసి చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు. తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. అంతకుముందు కోల్‌కతా జట్టు భారీ స్కోరు దిశగా సాగుతున్న దశలో తాహిర్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. నితీశ్ రాణా, రాబిన్ ఉతప్ప, రసెల్‌లను వెంటవెంటనే పెవిలియన్ పంపించాడు. అనంతరం సెంచరీ చేస్తాడనుకున్న క్రిస్ లిన్‌ను కూడా ఔట్ చేశాడు. చెన్నై ప్లేయర్ డు ప్లెసిస్ మొత్తం నాలుగు క్యాచ్‌లు పట్టగా ఇందులో ఉతప్పను ఔట్ చేసిన క్యాచ్ హైలైట్‌గా నిలిచింది. తాహిర్ బౌలింగ్‌లో ఉతప్ప భారీ షాట్ ఆడగా... లాంగాఫ్ నుంచి 25 గజాల వరకు ముందుకు పరుగెత్తి డు ప్లెసిస్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. -
ఉత్కం‘టై’న మ్యాచ్‌లో సఫారీ ‘సూపర్’ విక్టరీ
కేప్‌టౌన్: క్రికెట్ చిత్రమంటే ఇదేనేమో! చివరి బంతికి 2 పరుగులు చేయలేని తాహిర్... సూపర్ ఓవర్లో అదనంగా బంతులేసినా (2 వైడ్లు) లంకను అద్భుతంగా కట్టడి చేసి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక, తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 134 పరుగులే చేశాయి. ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన ఈ పొట్టి మ్యాచ్ ‘టై’ అయింది. దీంతో మ్యాచ్‌ను సూపర్ ఓవర్ తేల్చింది. దక్షిణాఫ్రికాను విజేతగా నిలిపింది. ముందుగా శ్రీలంక పేసర్ మలింగ వేసిన ఈ సూపర్ ఓవర్లో మిల్లర్ సిక్స్, ఫోర్‌తో సఫారీ జట్టు మొత్తం 14 పరుగులు చేసింది. లంక గెలవాలంటే 15 పరుగులు చేయాలి. అయితే తాహిర్ వేసిన ఓవర్లో పెరీరా, ఫెర్నాండో విఫలమయ్యారు. వైడ్ల రూపంలో 2 పరుగులొచ్చినా... 8 బంతులు ఎదుర్కొన్నా... లంక 3 పరుగులే చేసింది. మొత్తం 5 పరుగులకు మించి చేయలేకపోయింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ తొలి టి20లో మొదట శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు చేసింది. కమిండు మెండిస్ (41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశాడు. తర్వాత దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి సరిగ్గా 134 పరుగులే చేసింది. మిల్లర్ (41; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మలింగ 2 వికెట్లు తీశాడు. రేపు రెండో టి20 జరుగుతుంది. -
'ధోనికి బౌలింగ్ చేయనని చెప్పా'
పుణె: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంటే తనకు విపరీతమైన అభిమాని అంటున్నాడు దక్షిణాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 వ సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కు ఆడుతున్న తాహీర్.. తన సహచర ఆటగాడు ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'నేను ఇప్పటివరకూ కలిసిన ఉన్నతమైన వ్యక్తుల్లో ధోని ఒకడు. ఎప్పుడూ కూల్ గా ఉంటూ భారత్ క్రికెట్ కు అనే విజయాలు సాధించాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. నాకు అతనిచ్చే సలహాలు చాలా విలువైనవి. నేను ధోని నుంచి చాలా సలహాలు తీసుకున్నాను. అవి నా కెరీర్ కు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ ఐపీఎల్లో ధోనితో కలిసి ఆడుతున్నానని తెలిసిన తరువాత ఉద్వేగానికి లోనయ్యా'అని తాహీర్ తెలిపాడు. కాగా, నెట్ ప్రాక్టీస్ లో ధోనికి బౌలింగ్ చేయడాన్నిఎంజాయ్ చేయనని తాహీర్ తెలిపాడు. ఇదే విషయాన్ని ధోనికి చెప్పినట్లు ఈ నంబర్ వన్ వన్డే బౌలర్ పేర్కొన్నాడు. అందుకు కారణాన్ని కూడా వెల్లడించాడు. ఒకవేళ తాను బౌలింగ్ చేసిన పక్షంలో ధోని నుంచి కొన్ని సిక్సర్లను చూడాల్సి రావడం ఖాయమన్నాడు. ధోని చేత బాదించుకోవడం ఇష్టంలేకనే అతనికి నెట్స్ లో బౌలింగ్ చేయడానికి దూరంగా ఉంటున్నట్లు తాహీర్ తెలిపాడు. -
డివిలియర్స్ మెరుపులు దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్
జొహన్నెస్‌బర్గ్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. బౌలర్ల రాణింపునకు తోడు బ్యాటింగ్‌లో డివిలియర్స్ (29 బంతుల్లో 71; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన రెండో టి20లో ప్రొటీస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. తొలుత ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మోర్గాన్ (23 బంతుల్లో 38; 4 సిక్సర్లు), రూట్ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓ దశలో ఇంగ్లండ్ 4 వికెట్లకు 157 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. అయితే చివర్లో సఫారీ బౌలర్లు విజృంభించడంతో 14 పరుగుల తేడాతో చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. అబాట్ 3, రబడ, మోరిస్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. ఆమ్లా (38 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), డు ఫ్లెసిస్ (21 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
ఆమ్లా, తాహిర్‌లపై దృష్టి
నేటి నుంచి రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో దక్షిణాఫ్రికా ఢీ భారత యువ క్రికెటర్లకు గొప్ప అవకాశం ముంబై: దక్షిణాఫ్రికా జట్టు టి20, వన్డే సిరీస్‌లు గెలుచుకున్నా... ఆ జట్టు ప్రధాన బ్యాట్స్‌మన్ ఆమ్లాతో పాటు స్పిన్నర్ తాహిర్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే టెస్టుల్లో దక్షిణాఫ్రికా అవకాశాలు బాగుండాలంటే కచ్చితంగా ఈ ఇద్దరే కీలకం. ఈ నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌పై ఈ ఇద్దరూ దృష్టి సారించారు. టెస్టుల్లో జట్టు సారథిగానూ వ్యవహరించే ఆమ్లా ఓ భారీ ఇన్నింగ్స్‌తో గాడిలో పడటం కీలకం. వన్డే జట్టుతో పోలిస్తే జట్టులో కొద్దిగా మార్పులు ఉన్నాయి. డుఫ్లెసిస్, డివిలియర్స్‌లకు పెద్దగా సమస్య లేదు. బావుమా, హార్మర్, ఎల్గర్లాంటి క్రికెటర్లకు ఈ మ్యాచ్‌లో అవకాశం ఇవ్వడం ద్వారా పరిస్థితులకు అలవాటు పడొచ్చని దక్షిణాఫ్రికా భావిస్తోంది. ఇక బౌలింగ్‌లో పేసర్ మోర్నీ మోర్కెల్ కోలుకున్నా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాడో లేదో తెలియని సందిగ్దత. స్టెయిన్, ఫిలాండర్, రబడ కూడా ప్రాక్టీస్ కోసం ఆడొచ్చు. ఆఫ్ స్పిన్నర్లు హార్మర్, పిడిట్లను కూడా ఈ మ్యాచ్ ద్వారా పరీక్షించే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ ద్వారా సెలక్టర్ల దృష్టిని ఆక ర్షించాలని భారత యువ క్రికెటర్లు భావిస్తున్నారు. ఈ జట్టుకు పుజారా సారథ్యం వహిస్తుండగా... లోకేశ్ రాహుల్‌తో పాటు కరుణ్ నాయర్, శ్రేయస్ అయ్యర్, నామన్ ఓజాలాంటి బ్యాట్స్‌మెన్ సత్తా చూపించాలని తహతహలాడుతున్నారు. ఇక ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా మీద కూడా అందరి దృష్టి ఉంది. బౌలింగ్‌లో కరణ్ శర్మ, కుల్దీప్ యాదవ్‌లతో పాటు ఠాకూర్, జాక్సన్ కూడా కీలకం. సిరీస్ ఆరంభానికి ముందు జరిగిన టి20 ప్రాక్టీస్ మ్యాచ్‌లో సఫారీలు భారత యువ జట్టు చేతిలో ఓడిపోయారు. అయితే అసలు సిరీస్‌లో మాత్రం భారత్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫలితం కంటే... టెస్టులకు సన్నాహకంగా ఉపయోగించుకోవడం దక్షిణాఫ్రికా లక్ష్యం.