డివిలియర్స్ మెరుపులు దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్ | southofrica T20 Series | Sakshi
Sakshi News home page

డివిలియర్స్ మెరుపులు దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్

Published Mon, Feb 22 2016 12:39 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

డివిలియర్స్ మెరుపులు  దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్

డివిలియర్స్ మెరుపులు దక్షిణాఫ్రికాదే టి20 సిరీస్

 జొహన్నెస్‌బర్గ్: ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ (2-0) చేసింది. బౌలర్ల రాణింపునకు తోడు బ్యాటింగ్‌లో డివిలియర్స్ (29 బంతుల్లో 71; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దుమ్మురేపడంతో ఆదివారం జరిగిన రెండో టి20లో ప్రొటీస్ జట్టు 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. తొలుత ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. బట్లర్ (28 బంతుల్లో 54; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మోర్గాన్ (23 బంతుల్లో 38; 4 సిక్సర్లు), రూట్ (17 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు.

ఓ దశలో ఇంగ్లండ్ 4 వికెట్లకు 157 పరుగులు చేసి పటిష్టస్థితిలో నిలిచింది. అయితే చివర్లో సఫారీ బౌలర్లు విజృంభించడంతో 14 పరుగుల తేడాతో చివరి 6 వికెట్లు చేజార్చుకుంది. అబాట్ 3, రబడ, మోరిస్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా 14.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 172 పరుగులు చేసింది. ఆమ్లా (38 బంతుల్లో 69 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), డు ఫ్లెసిస్ (21 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; తాహిర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement