సెమీస్‌లో భారత్‌ బోల్తా | malaysia beats india in sepak takraw | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో భారత్‌ బోల్తా

Published Sun, Nov 5 2017 11:29 AM | Last Updated on Sun, Nov 5 2017 11:29 AM

malaysia beats india in sepak takraw - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో తొలిసారి జరుగుతోన్న సెపక్‌తక్రా ప్రపంచకప్‌లో మన ఆటగాళ్ల పోరాటం ముగిసింది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో ఓటమి పాలైంది. శనివారం జరిగిన పురుషుల టీమ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌ పోటీల్లో భారత్‌ 16–21, 8–21తో మలేసియా చేతిలో పరాజయం పాలైంది. దీంతో ఈ మెగా టోర్నీలో భారత్‌ పోరాటం ముగిసింది. భారత మహిళల జట్టు క్వార్టర్స్‌లో నిష్క్రమించింది. మరో సెమీస్‌లో థాయ్‌లాండ్‌ 21–5, 21–8తో సింగపూర్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement