మమత హైస్కూల్ గెలుపు | mamata high school beats vidya vihar high scholl in hand ball tourny | Sakshi
Sakshi News home page

మమత హైస్కూల్ గెలుపు

Published Tue, Sep 20 2016 10:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:16 PM

mamata high school beats vidya vihar high scholl in hand ball tourny

సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్‌లో మమత హైస్కూల్ జట్టు ముందంజ వేసింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అండర్-17 బాలుర పోటీల్లో మమత హైస్కూల్ జట్టు 8-13తో విద్యావిహార్ హైస్కూల్‌పై గెలుపొందింది. బాలికల విభాగంలో గతి హైస్కూల్ 7-5తో రైల్వేస్ బాలికల హైస్కూల్‌పై, మమత హైస్కూల్ 3-2తో కేర్ మోడల్ హైస్కూల్‌పై విజయం సాధించారుు. మరోవైపు అండర్-14 బాలుర విభాగంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (షేక్‌పేట) 10-12తో జీఎంహెచ్‌ఎస్ ఆలియా స్కూల్‌పై , విద్యావిహార్ హైస్కూల్ 7- 5తో కేర్‌మోడల్ హైస్కూల్ (అంబర్‌పేట)పై, మమత హైస్కూల్ 4-3తో గతి హైస్కూల్ పై నెగ్గారుు. బాలికల విభాగంలో సీఎంఆర్ మోడల్ హైస్కూల్ 7-5తో రైల్వేస్ హైస్కూల్‌పై, జీజీహెచ్‌ఎస్ పికెట్ స్కూల్ 3-1తో సీఎంఆర్ మోడల్ హైస్కూల్‌పై గెలుపొందాయి.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement