hand ball tourny
-
హ్యాండ్‌బాల్ టోర్నీలో తెలంగాణ జోరు
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు వరుస విజయాలతో ముందంజ వేసింది. గచ్చిబౌలీ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన పురుషుల విభాగంలో తెలంగాణ 26-13తో ఆంధ్రప్రదేశ్‌ను ఓడించింది. మరో లీగ్‌లో రాష్ట్ర జట్టు 27-7తో గోవాపై గెలుపొందింది. మిగతా మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్ 28-7తో పుదుచ్చేరిపై, రైల్వేస్ 19-17తో పశ్చిమ బెంగాల్‌పై, ఉత్తరాఖండ్ 39-25తో మణిపూర్‌పై, చత్తీస్‌గఢ్ 29-15తో ఢిల్లీపై, త్రిపుర 31-23తో హిమాచల్ ప్రదేశ్‌పై, ఉత్తరప్రదేశ్ 32-25తో బిహార్‌పై, అస్సాం 21-14తో ఒరిస్సాపై, జమ్మూకశ్మీర్ 40-28తో ఏపీపై, హరియాణా 57-39తో తమిళనాడుపై, మధ్యప్రదేశ్ 33-16తో గుజరాత్‌పై గెలుపొందాయి. -
మమత హైస్కూల్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ స్కూల్ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్లో మమత హైస్కూల్ జట్టు ముందంజ వేసింది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ స్కూల్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అండర్-17 బాలుర పోటీల్లో మమత హైస్కూల్ జట్టు 8-13తో విద్యావిహార్ హైస్కూల్‌పై గెలుపొందింది. బాలికల విభాగంలో గతి హైస్కూల్ 7-5తో రైల్వేస్ బాలికల హైస్కూల్‌పై, మమత హైస్కూల్ 3-2తో కేర్ మోడల్ హైస్కూల్‌పై విజయం సాధించారుు. మరోవైపు అండర్-14 బాలుర విభాగంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (షేక్‌పేట) 10-12తో జీఎంహెచ్‌ఎస్ ఆలియా స్కూల్‌పై , విద్యావిహార్ హైస్కూల్ 7- 5తో కేర్మోడల్ హైస్కూల్ (అంబర్‌పేట)పై, మమత హైస్కూల్ 4-3తో గతి హైస్కూల్ పై నెగ్గారుు. బాలికల విభాగంలో సీఎంఆర్ మోడల్ హైస్కూల్ 7-5తో రైల్వేస్ హైస్కూల్‌పై, జీజీహెచ్ఎస్ పికెట్ స్కూల్ 3-1తో సీఎంఆర్ మోడల్ హైస్కూల్‌పై గెలుపొందాయి. -
నేడు, రేపు హ్యాండ్‌బాల్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ హ్యాండ్‌బాల్ సంఘం ఆధ్వర్యంలో నేడు (మంగళవారం) ప్రొఫెసర్ జయశంకర్ స్మారక హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ టోర్నీ చింతల్‌బస్తీలోని రామ్‌లీలా గ్రౌండ్సలో జరుగుతుంది. టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారు.