ఫ్రెంచ్ ఓపెన్ ను చేజిక్కించుకున్న షరపోవా | maria sharapova wins french open title | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ ఓపెన్ ను చేజిక్కించుకున్న షరపోవా

Published Sat, Jun 7 2014 10:10 PM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

ఫ్రెంచ్ ఓపెన్ ను చేజిక్కించుకున్న షరపోవా

ఫ్రెంచ్ ఓపెన్ ను చేజిక్కించుకున్న షరపోవా

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ మహిళా సింగిల్స్ టైటిల్ ను మరోసారి మరియా షరపోవా (రష్యా) చేజిక్కించుకుంది. ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్ లో షరపోవా 6-4, 6-7, 6-4 తేడాతో సిమోనా హలెప్ (రుమేనియా) పై విజయం సాధించి టైటిల్ ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఫైనల్లో షరపోవా పదునైన సర్వీస్ లతో హలెప్  కు షాకిచ్చింది. తొలి గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన హలెప్ టైటిల్ ఆశలకు షరపోవా గండి కొట్టింది.  గత ఆరేళ్లుగా ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త చాంపియన్ అవతరిస్తూ వస్తున్న ఆనవాయితీకి కూడా షరపోవా బ్రేక్ వేసి టైటిల్ ను ఎగరేసుకుపోయింది.

 

వరుసగా మూడో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన షరపోవా.. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడిన సిమోనా హలెప్ లు  ఫైనల్ కు చేరే క్రమంలో ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ఫైనల్ చేరిన సిమోనా అదే జోరును అంతిమ పోరులో కొనసాగించలేకపోయింది. కాగా, కెరీర్‌లో సిమోనాతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన షరపోవా మళ్లీ అదే పునరావృతం చేసి తనకు తిరుగులేదని నిరూపించింది. 2012 లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకున్న షరపోవా తన సత్తాను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement