సెపాంగ్: ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి... చివరిదాకా దానిని కాపాడుకున్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ తన కెరీర్‌లో రెండోసారి ఫార్ములావన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన మలేసియా గ్రాండ్‌ప్రి రేసులో 20 ఏళ్ల ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ నిర్ణీత 56 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 30 నిమిషాల 01.290 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగో ల్యాప్‌లో తన ఆధిక్యాన్ని వెర్‌స్టాపెన్‌కు కోల్పోయాడు. ఆ తర్వాత వెర్‌స్టాపెన్ ఏ దశలోనూ హామిల్టన్‌కు ఓవర్‌టేక్ చేసే అవకాశం ఇవ్వలేదు.
దాంతో తుదకు హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఫెరారి డ్రైవర్ కిమీ రైకోనెన్ ఇంజిన్‌లో సమస్య తలత్తెడంతో తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. మరోవైపు భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఆరో స్థానాన్ని సంపాదించగా... ఒకాన్ పదో స్థానాన్ని పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి 8న జరుగుతుంది.
విజేత వెర్‌స్టాపెన్
Published Mon, Oct 2 2017 1:45 AM | Last Updated on Mon, Oct 2 2017 10:22 AM
Advertisement