
మైకేల్‌షుమాకర్
లండన్: ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆదివారం స్కీయింగ్ చేస్తూ గాయపడ్డాడు. వెంటనే అతన్ని హెలికాప్టర్‌లో మౌటియర్స్ (ఫ్రాన్స్)లో ఉన్న ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో 44 ఏళ్ల షుమాకర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడని, బహుశా తలకు స్వల్ప గాయమై ఉండొచ్చని మెరిబెల్ రిసార్ట్ డెరైక్టర్ క్రిస్టోఫ్ గెర్నిగ్నన్ తెలిపారు.
అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అతను స్పృహలోనే ఉన్నాడని ఆయన చెప్పారు. స్కీయింగ్ చేస్తున్నప్పుడు అతను హెల్మెట్ ధరించడంతో పెద్దగా దెబ్బలేవీ తగల్లేదని తెలిపారు. జర్మనీ మాజీ డ్రైవర్ ఏడు సార్లు ఫార్ములావన్ టైటిల్‌తో చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.