షుమాకర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది | Michael Schumacher: Wife Corinna says former F1 champion is 'getting better' | Sakshi
Sakshi News home page

షుమాకర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది

Published Sat, Jul 12 2014 1:31 AM | Last Updated on Wed, Aug 1 2018 4:17 PM

షుమాకర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది - Sakshi

షుమాకర్ ఆరోగ్యం మెరుగుపడుతోంది

 రేసర్ భార్య వెల్లడి
 బెర్లిన్: కోమా నుంచి బయటపడిన ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని అతని భార్య కొరినా షుమాకర్ వెల్లడించింది. ‘నెమ్మదిగా అయినా, కచ్చితంగా షుమీ ఆరోగ్యం బాగవుతుంది. ప్రస్తుతమైతే పరిస్థితి చాలా మెరుగ్గా, ప్రోత్సాహకరంగా ఉంది’ అని కొరినా పేర్కొంది.
 
 గతేడాది డిసెంబర్‌లో షుమాకర్ స్కీయింగ్ యాక్సిడెంట్ తర్వాత ఆమె బహిరంగంగా మాట్లాడటం ఇదే మొదటిసారి. దాదాపు ఆరు నెలల పాటు ఫ్రాన్స్‌లోని గ్రెనోబా ఆసుపత్రిలో చికిత్స పొందిన షుమాకర్ కోమా నుంచి బయటపడటంతో జూన్ 16న స్విట్జర్లాండ్‌లోని లుసానే ఆసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement