కరాచీ:పాకిస్తాన్ క్రికెట్ ప్రధాన కోచ్ పదవిపై నెలకొన్న సందిగ్థతకు ఎట్టకేలకు ఫుల్ స్టాప్ పడింది. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మికీ ఆర్థర్ ను కోచ్ గా నియమిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బోర్డు గవర్నర్స్ సమావేశంలో మికీ ఆర్థర్ నియమాకాన్ని ఖరారు చేశారు. దీనిలో భాగంగా ఆర్థర్తో పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ ఫోన్ లో మాట్లాడిన అనంతరం అతని ఎంపికను ధృవీకరించారు.
' పాక్ కోచ్ పదవిపై మికీ ఆర్థర్ను నియమించాలని బోర్డు గవర్నర్స్ సమావేశంలో నిర్ణయించాం. ఆ మేరకు ఆర్థర్ ను ఫోన్ లో సంప్రదిస్తే అందుకు అతను అంగీకరించాడు.ఈ నెల చివరికల్లా మికీ ఆర్థర్ జట్టుతో కలుస్తాడు'అని పీసీబీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా కోచ్ గా పని చేసిన ఆర్థర్.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో కరాచీ కింగ్స్ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు.
పాక్ కోచ్గా మికీ ఆర్థర్
Published Fri, May 6 2016 6:18 PM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM
Advertisement