
భారత జట్లకు చేజారిన పతకం
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు త్రుటిలో కాంస్య పతకాలు చేజారాయి. రష్యాలోని ఖాంటీ మన్‌సిస్క్‌లో సోమవారం
ప్రపంచ టీమ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లకు త్రుటిలో కాంస్య పతకాలు చేజారాయి. రష్యాలోని ఖాంటీ మన్‌సిస్క్‌లో సోమవారం ముగిసిన ఈ పోటీల్లో భారత మహిళల, పురుషుల జట్లు నాలుగో స్థానంలో నిలిచాయి. చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో భారత మహిళల జట్టు 3–1తో అజర్‌బైజాన్‌పై... పురుషుల జట్టు 3–1తో నార్వేపై గెలిచాయి. ఓవరాల్‌గా ఈ టోర్నీలో మహిళల జట్టు 12 పాయింట్లు, పురుషుల జట్టు 11 పాయింట్లు సాధించాయి. మహిళల విభాగంలో రష్యా... పురుషుల విభాగంలో చైనా విజేతలుగా నిలిచాయి.