
నంబర్‌వన్ మిథాలీ
దుబాయ్: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఐసీసీ బ్యాట్స్‌వుమన్ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో మిథాలీ ఆశించిన స్థాయిలో రాణించపోయినప్పటికీ నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకుంది. ఇక ఇంగ్లండ్‌పై ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న స్మృతి మందానా 23 ర్యాంకులు మెరుగుపర్చుకుని 40వ స్థానంలో నిలిచింది. మందానాకు ఇప్పటిదాకా కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు.