ఎంఎస్ ధోని (ఫైల్ ఫొటో)
జోహాన్నెస్‌బర్గ్ : టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని మరో అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాతోజరిగిన తొలి టీ20లో అత్యధిక క్యాచ్‌లందుకన్న వికెట్ కీపర్‌గా రికార్డు నమోదు చేశాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో హెన్‌డ్రీక్స్ క్యాచ్‌తో ఈ ఘనతను సొంతం చేసుకున్నా డు. ఓవరాల్‌గా 275 టీ20ల్లో ధోని 134 క్యాచ్‌లందుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగిన శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర(133) ను అధిగమించాడు.
గతంలో సంగక్కర 254 మ్యాచ్‌ల్లో 133 క్యాచ్‌లు పట్టి ఈ రికార్డును నెలకొల్పాడు. ఇక మూడో స్థానంలో భారత ఆటగాడు దినేశ్ కార్తిక్(227 టీ20 మ్యాచ్‌ల్లో 123 క్యాచ్‌లు), పాకిస్థాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్( 211 టీ20ల్లో 115 క్యాచ్‌లు), వెస్టిండీస్ కీపర్ దినేశ్ రామ్‌దిన్( 168 మ్యాచ్‌ల్లో 108 క్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్ కీపర్ల జాబితాల్లో ధోనీది మూడోస్థానం. ధోనీ ఇప్పటి వరకు 601 క్యాచ్‌లు, 174 స్టంపింగ్‌లు చేశాడు. మార్క్ బౌచర్ (952), ఆడమ్ గిల్‌క్రిస్ట్( 813) క్యాచ్‌లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
ఇక అంతర్జాతీయ టీ20ల్లో ధోని 77 వికెట్ల భాగస్వామ్యంతో వికెట్ కీపర్‌గా ఇప్పటికే అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇందులో 48 క్యాచ్ అవుట్‌లు, 29 స్టంపౌట్‌లున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment