
ఎంఎస్ ధోని ఇలా..
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు తన సొంత రాష్ట్ర జట్టు జార్ఖండ్తో బిజిబిజీగా ఉన్నాడు.
నాగ్పూర్: గత కొంతకాలం నుంచి క్రికెట్ దూరంగా ఉంటున్న టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పుడు తన రాష్ట్ర జట్టు జార్ఖండ్తో బిజిబిజీగా ఉన్నాడు. రంజీ సెమీ ఫైనల్లో భాగంగా ఆదివారం గుజరాత్తో ఏసీఏ స్టేడియంలో ఆరంభమైన మ్యాచ్కు హాజరైన ధోని.. జార్ఖండ్ జట్టులో అనధికార మెంటర్ పాత్ర పోషించాడు. తన రంజీ జట్టుకు కొన్ని విలువైన సూచనలు చేస్తూ ఆటగాళ్లతో భాగస్వామ్యం అయ్యాడు. త్వరలో ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నేపథ్యంలో ధోని ఇలా ఆటగాళ్లతో కలిసి తన అనుభవాన్ని పంచుకున్నాడు.
తన టెస్టు కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత ఎటువంటి లాంగర్ ఫార్మాట్లో ధోని పాల్గొనడం లేదు. గత అక్టోబర్ 29న విశాఖపట్నంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో తను చివరిసారిగా ఆడాడు. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ జనవరి 15 నుంచి ప్రారంభం కానున్న తరుణంలో ముందుగా జార్ఖండ్ జట్టు సభ్యుల ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నాడు.