ధోని 33 పరుగుల దూరంలో.. | MS Dhoni Is Just 33 Runs Short Of Achieving This Incredible Feat | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 12 2018 4:52 PM | Last Updated on Thu, Jul 12 2018 4:52 PM

MS Dhoni Is Just 33 Runs Short Of Achieving This Incredible Feat - Sakshi

ఎంఎస్‌ ధోని( ఫైల్‌ ఫోటో)

నాటింగ్‌హామ్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఖాతాలో మరో రికార్డు నమోదు కానుంది. ఇంగ్లండ్‌తో గురువారం జరగనున్న తొలి వన్డేలో ధోని 33 పరుగుల సాధిస్తే పదివేల పరుగులు పూర్తవుతాయి. దీంతో అంతర్జాతీయ వన్డే చరిత్రలో పదివేల పరుగులు పూర్తిచేసిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. గతంలో టీమిండియా దిగ్గజాలు సచిన్‌, గంగూలి, ద్రవిడ్‌లు ఈ ఫీట్‌ను సాధించారు. ఓవరాల్‌గా పదివేల క్లబ్‌లో చేరిన 12వ ఆటగాడిగా ధోని చేరే అవకాశం ఉంది. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో క్రికెట్‌ గాడ్‌, టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ (18426) ఆగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

రెండో వికెట్‌ కీపర్‌గా.. ఇంగ్లండ్‌తో వన్డే మ్యాచ్‌లో 33 పరుగులు సాధిస్తే పదివేల పరుగుల సాధించిన రెండో వికెట్‌ కీపర్‌గా ధోని అరుదైన ఘనత సాధించనున్నాడు. ఈ జాబితాలో శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర తొలి స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు 318వన్డేలు ఆడిన ధోని 9967 పరుగలు పూర్తి చేశాడు.. ఇందులో10 శతకాలు, 67 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌ చేసిన కీపర్‌గా ధోని(107) తొలి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో సంగక్కర (99) రెండో స్థానంలో ఉన్నాడు. 

గతంలో పదివేల పరుగులు పూర్తిచేసిన క్రికెటర్లు

  1. సచిన్‌ టెండూల్కర్‌ (భారత్‌)- 18426 (463 మ్యాచ్‌ల్లో)
  2. కుమార సంగక్కర (శ్రీలంక)- 14,234 (404 మ్యాచ్‌ల్లో)
  3. రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా)- 13,704 (375 మ్యాచ్‌ల్లో)
  4. సనత్‌ జయసూర్య( శ్రీలంక)- 13,430 (445 మ్యాచ్‌ల్లో)
  5. మహేళ జయవర్దనే(శ్రీలంక)- 12,650 (448 మ్యాచ్‌ల్లో)
  6. ఇంజమాముల్‌ హక్‌(పాకిస్తాన్‌)- 11,739 (378 మ్యాచ్‌ల్లో)
  7. జాక్వస్‌ కలిస్‌( దక్షిణాఫ్రికా)- 11,579 (328 మ్యాచ్‌ల్లో)
  8. సౌరవ్‌ గంగూలి (భారత్‌)- 11,363 (311 మ్యాచ్‌ల్లో)
  9. రాహుల్‌ ద్రవిడ్‌(భారత్‌)- 10,889 (344 మ్యాచ్‌ల్లో)
  10. బ్రియాన్‌ లారా(వెస్టిండీస్‌)- 10,405 (299 మ్యాచ్‌ల్లో)
  11. తిలకరత్నే దిల్షాన్‌( శ్రీలంక)- 10,290 ( 330 మ్యాచ్‌ల్లో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement