ఎంఎస్ ధోని 'నంబర్ గేమ్'.. | MS Dhoni Number game | Sakshi
Sakshi News home page

ఎంఎస్ ధోని 'నంబర్ గేమ్'..

Published Thu, Jan 5 2017 1:55 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

ఎంఎస్ ధోని 'నంబర్ గేమ్'..

ఎంఎస్ ధోని 'నంబర్ గేమ్'..

ముంబై:రెండేళ్ల క్రితం టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలిగిన టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు వన్డే, టీ 20ల కెప్టెన్సీ పదవులకు సైతం గుడ్ బై చెప్పాడు. భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్గా నిలిచాడు. ఈ క్రమంలో మహేంద్రుడి కెప్టెన్సీలోని 'నంబర్ గేమ్' ను ఒకసారి పరిశీలిద్దాం.


 1. భారత్ తరపున ఆరు వరల్డ్ టీ 20 ఎడిషన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్

2. మూడు ఐసీసీ మేజర్ టోర్నమెంట్లను గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్

3. ప్రతీ ఫార్మాట్లోనూ కనీసం 50 మ్యాచ్లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్

4. వన్డే ఫార్మాట్లో కెప్టెన్గా 110 విజయాలు సాధించిన ధోని.. 74 పరాజయాలను ఎదుర్కొన్నాడు. కనీసం 20 వన్డేలకు సారథ్యం వహించిన భారత ఆటగాళ్ల పరంగా చూస్తే గెలుపు-ఓటముల రికార్డులో ధోనినే అత్యుత్తమ గణాంకాలను కల్గి ఉన్నాడు.

5. ఐదు-అంతకంటే ఎక్కువ జట్లు ఆడిన నాలుగు టోర్నమెంట్లను గెలిచిన ఘనత ధోనిది. ఈ ఘనతను సాధించిన కెప్టెన్ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్తో కలిసి ధోని సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.

6. ఎనిమిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్లను ధోని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ తొమ్మిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్లను గెలిచిన వారిలో కెప్టెన్గా రికీ పాంటింగ్ ముందున్నాడు. తొమ్మిది టెస్టు దేశాలపై పాంటింగ్ వన్డే సిరీస్లను గెలిచాడు. కాగా, బంగ్లాదేశ్పై ద్వైపాక్షిక వన్డే సిరీస్ను సాధించడంలో ధోని విఫలం కావడంతో పాంటింగ్ సరసన నిలవలేకపోయాడు.

7. 43 వన్డే సిరీస్లకు ధోని సారథిగా వ్యహరించాడు. ఇది భారత్ తరపున అత్యధికం కాగా, ఓవరాల్గా నాల్గోది.

8. భారత్ సాధించిన విజయాల్లో వన్డే కెప్టెన్గా ధోని యావరేజ్ 70.83గా ఉంది. కనీసం వెయ్యి పరుగుల సాధించిన ఓవరాల్ కెప్టెన్లలో ఇది మూడో అత్యుత్తమ యావరేజ్. ఇక్కడ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, సచిన్ టెండూల్కర్లు ముందువరుసలో ఉన్నారు.

9. 72 ట్వంటీ 20లకు కెప్టెన్గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ ధోని

10.భారత జట్టు 110 వన్డే విజయాలకు ధోని కెప్టెన్గా వ్యవహరించాడు. భారత్ తరపున ఇదే అత్యధికం కాగా, ఒక జాతీయ జట్టుకు అత్యధిక వన్డే విజయాలను అందించిన రెండో కెప్టెన్ గా ధోని నిలిచాడు. అగ్రస్థానంలో పాంటింగ్(165) ఉన్నాడు.

11. కెప్టెన్ గా ధోని కొట్టిన సిక్స్లు 126. ఓవరాల్ కెప్టెన్గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత ధోనిది.

12.199 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక  భారత్ ఆటగాడు ధోని. ఓవరాల్గా మూడో స్థానంలో ఉన్నాడు.

13. అన్ని ఫార్మాట్లలో 331 మ్యాచ్లకు ధోని సారథిగా వ్యవహరించాడు. ఇదే ఓవరాల్గా అత్యధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement