number game
-
వారణాసిలో ఏ వర్గంవారు ఎందరు? బీజేపీ ఎన్నిసార్లు గెలిచింది?
యూపీలోని వారణాసి లోక్‌సభ ఎన్నికల పోరులో మరోసారి బరిలోకి దిగేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఆయన ఈ స్థానం నుంచి నేడు(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. గత ఎన్నికల విజయాల కంటే ఈసారి మోదీ భారీ విజయాన్ని నమోదు చేస్తారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వారణాసిలో ఏ వర్గంవారు అధిక సంఖ్యలో ఉన్నారు? ఎన్నికల ఫలితాలను నిర్ణయించడంలో ఏ అంశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది?దేశ ఆధ్యాత్మిక రాజధానిగా పేరొందిన వారణాసి లోక్‌సభ స్థానం ఐదు అసెంబ్లీ స్థానాల కలయిక. అవి వారణాసి సౌత్ సిటీ, వారణాసి నార్త్, వారణాసి కాంట్, రోహనియా, సేవాపురి. 1957 నుంచి ఈ సీటును బీజేపీ ఏడుసార్లు, కాంగ్రెస్ ఆరుసార్లు దక్కించుకున్నాయి. 1991 నుంచి 2003 మధ్యకాలంలో ఒక్కసారి మాత్రమే ఈ సీటు బీజేపీ నుంచి కాంగ్రెస్ చేతికి చిక్కింది. 2009 నుంచి ఈ సీటును బీజేపీ అభ్యర్థులు వరుసగా గెలుస్తూ వస్తున్నారు. దీంతో వారణాసి బీజేపీకి కంచుకోటగా మారింది.వారణాసి నియోజక వర్గంలో మొత్తం 19.62 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10 లక్షల 65 వేల 485 మంది పురుషులు, 8 లక్షల 97 వేల 328 మంది మహిళలు. వారణాసిలో 135 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. 52 వేల 174 మంది ఓటర్లు తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.వారణాసి లోక్‌సభ స్థానంలో మొత్తం జనాభాలో 75 శాతం మంది హిందువులు, 20 శాతం ముస్లింలు. మిగిలిన ఐదు శాతం జనాభాలో ఇతర మతాలకు చెందిన వారున్నారు. ఈ నియోజకవర్గంలో 65 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో, 35 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మొత్తం జనాభాలో 10.01 శాతం గిరిజనులు , 0.7 శాతం దళిత తరగతికి చెందినవారున్నారు.ఈ నియోజక వర్గంలో గరిష్టంగా రెండు లక్షల మంది ఓటర్లు కుర్మీ సామాజికవర్గానికి చెందినవారున్నారు. వీరు రోహనియా, సేవాపురి ప్రాంతాలలో ఉన్నారు. ఈ స్థానంలో రెండు లక్షల మంది వైశ్య ఓటర్లు కూడా ఉన్నారు. వారు ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నారు. కుర్మీ, వైశ్య వర్గం తర్వాత బ్రాహ్మణ, భూమిహార్ ఓటర్లు కూడా వారణాసిలో అత్యధికులు ఉన్నారు. ఈ సీటుపై ఎన్నికల విజయ పతాకాన్ని ఎగురవేసే శక్తి యాదవ, ముస్లిం వర్గాల ఓట్లకు కూడా ఉంది. ఈ స్థానంలో యాదవ సామాజికవర్గానికి లక్ష ఓట్లు ఉన్నాయి. యాదవ ఓటర్లు కాకుండా ఈ స్థానంలో మొత్తం మూడు లక్షల మంది ఓటర్లు ఓబీసీ వర్గానికి చెందినవారున్నారు. -
మొదలైన నంబర్ గేమ్; ఎత్తుకు పైఎత్తులు.. ఎవరిది పైచేయి!
న్యూఢిల్లీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు గోవాలో నంబర్ గేమ్ మొదలయింది. తమకు మెజారిటీ రాకుంటే ఏం చేయాలనే దానిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బీజేపీ కొట్టిపారేసింది. గోవాలో పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామని కమలనాథులు అంటున్నారు. ఢిల్లీలో సావంత్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ప్రధాని నరేంద్ర మోదీని కలవడానికి ఢిల్లీకి వచ్చారు. గోవాలో అధికారాన్ని నిలుపుకునే అవకాశాల గురించి ప్రధానికి ఆయన వివరించనున్నారు. గోవా బీజేపీ ఇన్ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ కోసం తర్వాత ముంబైకి వెళ్లనున్నారు. బీజేపీ కసరత్తు అధికారాన్ని నిలుపుకుంటామని చెబుతూనే.. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ), స్వతంత్రులతో చర్చలు బీజేపీ సాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ప్రమోద్ సావంత్‌కు మద్దతు ఇవ్వడానికి ఎంజీపీ మొగ్గు చూపడం లేదని సమాచారం. ఒకవేళ తమ మద్దతు తప్పనిసరి అయితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఎంజీపీ డిమాండ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎదురయితే బీజేపీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ముందు జాగ్రత్త గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అటు కాంగ్రెస్ పార్టీ కూడా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. అవసరమైతే ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమవుతున్నట్టు సూచనప్రాయంగా వెల్లడించింది. ‘బీజేపీని వ్యతిరేకించే ఏ పార్టీతోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామ’ని కాంగ్రెస్ నాయకుడు, గోవా ఇన్ఛార్జ్ దినేష్ గుండూరావు ఎన్డీటీవీతో ప్రకటించారు. సీనియర్ నాయకులు పి. చిదంబరం, డీకే శివకుమార్లను ఇప్పటికే గోవాకు పంపించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరూ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. గెలిచే అవకాశమున్న కాంగ్రెస్ నేతలను ఇతర రాష్ట్రాలకు పంపించారు. గతంలో జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చూసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. (క్లిక్: ఏం జరగబోతోంది.. యోగికి మళ్లీ పట్టం కడతారా?) ఎగ్జిట్‌పోల్స్ ఏం చెప్పాయి తాజా ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 16 సీట్ల చొప్పున వస్తాయని తెలిపాయి. తృణమూల్‌కు 3, ఇతరులకు 5 సీట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశాయి. ఎంజీపీతో పొత్తు పెట్టుకుని తొలిసారిగా గోవాలో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్‌కు 3 సీట్లు వస్తాయని అంచనా వేయడంతో ఆ పార్టీ ఈసారి కీలకం కానుంది. గోవాలో ఎవరు అధికారం చేపడతారో తెలియాలంటే మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే దాకా వేచిచూడాల్సిందే. (క్లిక్: గోవాలో హంగ్.. కింగ్ మేకర్ అయ్యేది ఎవరో?) -
జోరుగా సింగిల్ నంబర్ ఆట
గుంటూరు ఈస్ట్: గుంటూరు నగరంలో సింగిల్ నంబర్ ఆట జోరుగా సాగుతోంది. నెలకు కోటి రూపాయలకు పైగా బెట్టింగ్‌ల కింద కాయకష్టం చేసుకునే పేద, మధ్య తరగతి వ్యక్తుల కష్టార్జితాన్ని నిర్వాహకులు దోచుకుంటున్నారు. ఒక అరండల్‌పేటలోనే వంద మీటర్ల దూరంలో మూడు చోట్ల సింగిల్ నంబర్ ఆట నిర్వహిస్తున్నారంటే ఏ స్థాయిలో నడుస్తోందో చెప్పనవసరం లేదు. నిర్వాహకులకు పోలీసుల అండదండలు లేనిదే ఇది కొనసాగదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క కొరిటిపాడు పరిధిలో నెలకు రూ. 30 లక్షలకు పైగా చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి రోడ్డు, స్వర్ణభారతీ నగర్ తదితర ప్రాంతాలలోనూ నిర్వాహకులు ధైర్యంగా మెయిన్ రోడ్లలోని చిన్నచిన్న బంకులు కేంద్రంగా సింగిల్ నంబర్ ఆట నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి పండుగ నేపథ్యంలో అన్ని కాలనీలలో పెద్దసంఖ్యలో రోజు వారి కూలీలలతోపాటు మధ్య తరగతివారు పోటీ పడి టికెట్లు కొంటున్నారు. ప్రధాన నిర్వాహకుడు ఓ ఖరీదైన లాడ్జిలో ఉండి అన్ని కాలనీల్లో ఆర్థికంగా చితికిపోయిన వ్యక్తుల్ని మధ్యవర్తులుగా నియమించాడు. కొందరికి కమీషన్ రూపంలో, కొందరికి రోజుకు కొంత మొత్తం చెల్లిస్తూ కిందిస్థాయి పోలీసుల ద్వారా మామూళ్లూ పంపుతూ ధైర్యంగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆట ఆటకు ఓ పేరు సినీ నటి శ్రీదేవి మరణించిన రెండు రోజుల నుంచి ప్రారంభించిన ఆటకు శ్రీదేవి అని పేరు పెట్టారు. కల్యాణి, శ్రీదేవి, టైజజార్, మెలాండే, వివిధ పేర్లతో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో అన్ని కాలనీల్లో టిక్కెట్లు విక్రయిస్తున్నారు. 11.30 నిమిషాలకు మొదటి ఫలితాలు వస్తాయి. 12.30కు రెండో ఫలితం, 1 గంటకు 3 ఫలితం వెల్లడవుతాయి. సాయంత్ర 5 గంటలకు ముగుస్తాయి. బాంబే పేరుతో నిర్వహించే ఆట రాత్రంతా కొనసాగుతుంది. టికెట్ మీద ఉన్న నంబర్ తగిలితే 10 రూపాయలకు 70 , 100 రూపాయలకు 700 ఇస్తారు. ఈ ఆశతో ఎక్కువ మంది డబ్బులు వెచ్చిస్తున్నారు.అయితే, నెంబర్ తగిలేది కొంతమందికే. పబ్లిక్‌గా రోజువారి వసూళ్లు సింగిల్ నంబర్ ఆటల నిర్వాహకుల నుంచి కానిస్టేబుళ్లు, హోంగార్డులు పబ్లిక్‌గా రోజువారి మామూళ్లు తీసుకుంటూ చూసీచూడనట్టు వదిలేస్తున్నరని విమర్శలు వినిపిస్తున్నాయి. రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీనగర్ ఠాగూర్ బొమ్మ సెంటర్, అరండల్‌పేట 7వ లైను, పిచ్చుకల గుంట గోడ పక్కన ఆటలు నిర్వహిస్తున్నారని స్థానికులు వీడియో, ఫోటోలు తీసి రుజువు చూపిస్తున్నారు. ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న హోంగార్డులు, కానిస్టేబుళ్లు ఆ సమయంలో వెళ్లి పబ్లిక్‌గా మామూళ్లు తీసుకుంటుంటారని స్థానికులు విమర్శిస్తున్నారు. -
నంబర్ గేమ్‌లో నెగ్గేదెవరు..?
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణకు కౌంట్‌డౌన్ మొదలవడంతో అసెంబ్లీ సాక్షిగా వెలువడే ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యడ్యూరప్ప సర్కార్ శనివారం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో బలం నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీఎస్‌తో పొత్తున్న బీఎస్పీ నుంచి ఓ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీల కూటమికి 116 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా తమకు మద్దతు ఇస్తారని చెబుతుండటంతో కూటమి బలం 118కి పెరిగింది. ఇది సాధారణ మెజారిటీ అయిన 111 కంటే అధికం కావడం గమనార్హం. ప్రస్తుతం 222 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ సభా కార్యకలాపాలు చేపడుతున్నందున సభ్యుల సంఖ్య 221కు తగ్గుతుంది. ఇక ఇరు పక్షాల బలం సమానమైతే తప్ప ప్రొటెం స్పీకర్ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. ఇక 104 మంది ఎమ్మెల్యేల మద్దతున్న యడ్యూరప్ప బలనిరూపణలో గట్టెక్కాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఓటింగ్‌కు కొందరు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటే మేజిక్ మార్క్ మరింత దిగివస్తుంది. మరోవైపు యడ్యూరప్ప బలనిరూపణ ముగిసేవరకూ ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిని నామినేట్ చేయరాదని, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇరు పక్షాలు స్పష్టమైన మెజారిటీ తమకే ఉందంటూ తెరచాటు మంత్రాంగాలు నెరుపుతున్న క్రమంలో కన్నడ సభలో బలనిరూపణపై సర్వత్రా ఉత్కఠ నెలకొంది. -
నంబర్లాట..బెట్టింగ్ కోట
నెల్లూరు(క్రైమ్), కావలి : పట్టణంలో నంబర్లాట జూదం జోరుగా సాగుతోంది. మానస సెంటర్, జెండా చెట్టు సెంటర్, దేవి థియేటర్ రోడ్డు, రైల్వే స్టేషన్ సెంటర్, ఒంగోలు బస్టాండ్ సెంటర్, వాయునందన ప్రెస్ వీధి, రామ్మూర్తిపేట, పాతూరు, కచ్చేరిమిట్ట, తుఫాన్‌నగర్, ఇందిరా నగర్, వెంగళరావునగర్, వైకుంఠపురం, తదితర ప్రాంతాలను కేంద్రంగా చేసుకుని జూదరులు నంబర్లాట నిర్వహిస్తున్నారు. గతంలో పబ్లిక్‌గా నిర్వహించే జూదరులు పోలీసుల దాడులతో ప్రస్తుతం చాటుమాటుగా కొనసాగిస్తున్నారు. ఈ జూదంలో ఆరితేరిన బుకీలు పట్టణంలో వంద మందికి పైగా ఉన్నట్లు సమాచారం. సాధారణ వ్యక్తుల నుంచి వివిధ వృత్తుల్లో గుర్తింపు ఉన్నవారు సైతనం నంబర్లు రాసుకుని బుకీలుగా వ్యవహరిస్తున్నారు. జూదం నిర్వహించే బుకీల్లో కొందరు ఆర్థికంగా నిలదొక్కుకోగా, మరి కొందరు ఆర్థికంగా చితికిపోయారు. బెట్టింగ్‌లు కట్టే వారు సైతం ఆర్థికంగా దెబ్బతిని రోడ్డున పడుతున్నారు. అంతా మోసమే నంబర్లాట, మట్కా, బ్రాకెట్ నంబర్లు, కళ్యాణి, తదితర పేర్లతో నిర్వహించే నంబర్ల గేమింగ్ జూదం ముంబాయి కేంద్రంగా సాగుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక నంబర్‌పై అంటే 0 నుంచి 9 వరకు బెట్టింగ్ కాస్తారు. 12 గంటల తర్వాత గెలిచిన నంబర్‌ను ప్రకటిస్తారు. దీనిని ఓపెనింగ్ నంబర్ అంటారు. గెలిచిన నంబర్‌పై నగదు పెట్టిన వారికి రూ.100కు రూ.400 ఇస్తారు. మళ్లీ సాయంత్రం 6 గంటల వరకు రెండు నంబర్ల(01 నుంచి 99 వరకు)పై బెట్టింగ్ పెడతారు. దీనిని క్లోజింగ్ అంటారు. రెండు నంబర్లపై బెట్టింగ్ పెట్టి విజేతగా నిలిచి వారికి రూ.100కు రూ.8వేలు ఇస్తారు. పెద్ద ఎత్తున సాగే ఈ జూదానికి స్థానికులు కొందరు బుకీలుగా వ్యవహరిస్తారు. వాస్తవానికి వారే నిర్వాహకులైన కమీషన్ ఏజెంట్లుగా నమ్మిస్తుంటారు. బెట్టింగ్ కట్టిన నంబర్ రాకపోతే నగదును జేబుల్లో వేసుకొంటారు. నంబర్ గెలిస్తే నగదును చెల్లిస్తుంటారు. నంబర్ గెలవడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతోంది. గెస్సింగ్ నంబర్ చార్ట్ ఏ రోజు ఏ పూట ఏ నంబర్ విజేతగా వస్తోందో తెలియజేసే గెస్సింగ్ నంబర్ చార్టు అంటూ మరో రకం మోసం కూడా ఈ జూదంలో ఉండటం గమనార్హం. గెస్సింగ్ నంబర్లతో ఉండే చార్ట్‌ను జూదం వ్యసనపరులు తాళపత్ర గ్రంథంలా భావిస్తుంటారు. ఈ చార్ట్‌లను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొంటారు. ఈ జూదంలో బాగా తలపండిన వారు తామే స్వతహాగా చార్ట్‌ను తయారు చేసుకొంటారు. ఏడాది, నెల, వారం, తేదీ, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని, ఆ రోజు మొదటి నంబర్ విజేత ఏది, రెండు నంబర్ల విజేత ఏది అన్ని గెస్సింగ్ చేస్తుంటారు. గెస్సింగ్ నంబర్లు చెప్పే నిష్ణాతులుగా పట్టణంలో కొందరికి గుర్తింపు కూడా ఉండటం గమనార్హం. నంబర్లాట జూదం ఆడి డబ్బును పోగొట్టుకుని కటుంబాలను నాశనం చేసుకున్న వారు పట్టణంలో వేలాది మంది ఉన్నారు. నిర్వాహకుల్లో కొందరు ఆర్థికంగా స్థితిమంతులు కాగా, మరి కొందరు ఆస్తులను పోగొట్టుకొని కూలీలుగా మారారు. పట్టణానికి చెందిన ఓ యువకుడు జూదం నిర్వహిస్తూ బాగా సంపాదించాడు. ఒకసారి ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో డబుల్ నంబర్‌పై బెట్టింగ్ కాయగా ఆ నంబర్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో లక్షలాది రూపాయలు చెల్లించాల్సి రావడంతో ఆస్తులను పోగొట్టుకుని దినసరి కూలీగా మారాడు. అరెస్ట్‌లకు రంగం సిద్ధం పట్టణంలో నంబర్ల జూదానికి పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. తాజాగా బుధవారం ఒకటో పట్టణ పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రెండో పట్టణ పోలీసులు జూదరులపై దృష్టి సారించారు. జూదం ఆడుతుంటే సమాచారం అందుకుని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన తమపై బుకీలు తిరగబడ్డారని, కొట్టారని, పారిపోవడానికి ప్రయత్నించి తోసేశారని కేసులు నమోదు చేస్తున్నారు. రౌడీషీట్లు సైతం ఓపెన్ చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఎంఎస్ ధోని 'నంబర్ గేమ్'..
ముంబై:రెండేళ్ల క్రితం టెస్టు ఫార్మాట్ నుంచి వైదొలిగిన టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని.. ఇప్పుడు వన్డే, టీ 20ల కెప్టెన్సీ పదవులకు సైతం గుడ్ బై చెప్పాడు. భారత క్రికెట్ జట్టు ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో పాలు పంచుకున్న ధోని.. 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు సారథిగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ వరల్డ్ టీ 20, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలను గెలిచి ఆ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో మహేంద్రుడి కెప్టెన్సీలోని 'నంబర్ గేమ్' ను ఒకసారి పరిశీలిద్దాం. 1. భారత్ తరపున ఆరు వరల్డ్ టీ 20 ఎడిషన్లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ 2. మూడు ఐసీసీ మేజర్ టోర్నమెంట్లను గెలిచిన ఒకే ఒక్క కెప్టెన్ 3. ప్రతీ ఫార్మాట్లోనూ కనీసం 50 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ఏకైక కెప్టెన్ 4. వన్డే ఫార్మాట్లో కెప్టెన్‌గా 110 విజయాలు సాధించిన ధోని.. 74 పరాజయాలను ఎదుర్కొన్నాడు. కనీసం 20 వన్డేలకు సారథ్యం వహించిన భారత ఆటగాళ్ల పరంగా చూస్తే గెలుపు-ఓటముల రికార్డులో ధోనినే అత్యుత్తమ గణాంకాలను కల్గి ఉన్నాడు. 5. ఐదు-అంతకంటే ఎక్కువ జట్లు ఆడిన నాలుగు టోర్నమెంట్లను గెలిచిన ఘనత ధోనిది. ఈ ఘనతను సాధించిన కెప్టెన్ల పరంగా చూస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌తో కలిసి ధోని సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. 6. ఎనిమిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను ధోని సొంతం చేసుకున్నాడు. ఇక్కడ తొమ్మిది టెస్టు హోదా కల్గిన దేశాలపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలిచిన వారిలో కెప్టెన్‌గా రికీ పాంటింగ్ ముందున్నాడు. తొమ్మిది టెస్టు దేశాలపై పాంటింగ్ వన్డే సిరీస్‌లను గెలిచాడు. కాగా, బంగ్లాదేశ్‌పై ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సాధించడంలో ధోని విఫలం కావడంతో పాంటింగ్ సరసన నిలవలేకపోయాడు. 7. 43 వన్డే సిరీస్‌లకు ధోని సారథిగా వ్యహరించాడు. ఇది భారత్ తరపున అత్యధికం కాగా, ఓవరాల్‌గా నాల్గోది. 8. భారత్ సాధించిన విజయాల్లో వన్డే కెప్టెన్‌గా ధోని యావరేజ్ 70.83గా ఉంది. కనీసం వెయ్యి పరుగుల సాధించిన ఓవరాల్ కెప్టెన్లలో ఇది మూడో అత్యుత్తమ యావరేజ్. ఇక్కడ దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, సచిన్ టెండూల్కర్లు ముందువరుసలో ఉన్నారు. 9. 72 ట్వంటీ 20లకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్ ధోని 10.భారత జట్టు 110 వన్డే విజయాలకు ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. భారత్ తరపున ఇదే అత్యధికం కాగా, ఒక జాతీయ జట్టుకు అత్యధిక వన్డే విజయాలను అందించిన రెండో కెప్టెన్ గా ధోని నిలిచాడు. అగ్రస్థానంలో పాంటింగ్(165) ఉన్నాడు. 11. కెప్టెన్ గా ధోని కొట్టిన సిక్స్‌లు 126. ఓవరాల్ కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత ధోనిది. 12.199 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక భారత్ ఆటగాడు ధోని. ఓవరాల్‌గా మూడో స్థానంలో ఉన్నాడు. 13. అన్ని ఫార్మాట్లలో 331 మ్యాచ్‌లకు ధోని సారథిగా వ్యవహరించాడు. ఇదే ఓవరాల్‌గా అత్యధికం. -
మీరు పాతనోట్లివ్వండి...
= జిల్లాలో జోరుగా నంబర్‌గేమ్ = పాతనోట్లతో ఆకర్షిస్తున్న మట్కా బీటర్లు = నంబర్ తగిలితే కొత్తనోట్లు ఇస్తామని వల = అనంతపురం రెండు రోజుల్లో రూ.కోటికి పైగా లావాదేవీలు = అన్నీతెలిసీ కళ్లుమూసుకున్న పోలీసులు మీరు పాతనోట్లివ్వండి...మేము కొత్తనోట్లిస్తా మంటున్నారు మట్కానిర్వాహకులు...దీంతో జనం నంబర్‌గేమ్ ఆడేందుకు ఎగబడుతున్నారు. 9.15 గంటలకోసారి...11.15 గంటలకోసారి తమ అదృష్టాన్ని తెలుసుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో మట్కా ఆడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. అందువల్లే రెండు రోజుల్లోనే కేవలం అనంతపురం నగర పరిధిలోనే కోట్లలో మట్కా లావాదేవీలు నడిచినట్లు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం పెట్రోలు బంకులు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్లతో సహా ఎక్కడా పాతనోట్లు చెల్లుబాటు కాదని ఆర్బీఐ తేల్చేసింది. పాతనోట్లు ఉన్నవారు బ్యాంకుల్లో జమ చేయడం మినహా మరోదారి లేదని వెల్లడించింది. కానీ జిల్లాలోని మట్కా నిర్వాహకులు మాత్రం పాతనోట్లు స్వీకరిస్తున్నారు. మట్కా నంబర్ తగిలితే కొత్తనోట్లు ఇస్తామని చెబుతున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేనివిధంగా మట్కావ్యాపారం జోరుగా నడుస్తోంది. గురు, శుక్ర రెండురోజుల్లో అనంతపురం నగర పరిధిలోనే రూ.కోటికిపైగా మట్కా లావాదేవీలు నడిచాయంటే.. జిల్లా వ్యాప్తంగా మట్కా ఏ స్థాయిలో నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఇదీ మట్కా నడుస్తోన్న తీరు అనంతపురం, తాడిపత్రి, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, హిందూపురంలో భారీగా మట్కా నడుస్తోంది. గతంలో రతన్‌లాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరు రోజులు జరుగుతున్నారుు. ఈ మాట్కాకు నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా ‘అనంత’లోని కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా మట్కా నిర్వహిస్తున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5 గంటల వరకు చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ‘ఓపెన్’, రాత్రి 11.15కు ‘క్లోజ్’ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. దీంతోనే మట్కా రాయుళ్లు చాలామంది మట్కా నంబర్ రాసిన తర్వాత నంబర్ వెల్లడయ్యే వరకు టెన్షన్ తట్టుకోలేక ఫస్ట్‌షో, సెకండ్‌షో సినిమాలకు వెళుతుంటారు. అనంతపురం వన్‌టౌన్ పరిధిలో మట్కాబీటర్లు అధికం. ఇక్కడ ఎవరు మట్కా నిర్వహిస్తారు? మట్కా బీటర్లు ఎవరనే సంగతి ఇక్కడి పోలీసులకు క్షుణ్ణంగా తెలుసు. అయినా మట్కా నిర్వహణకు బ్రేక్ వేయలేకపోతున్నారు. దీనికి కారణం మట్కాబీటర్లకు ఇక్కడి కొంతమంది పోలీసులతో ఉన్న సత్ససంబంధాలే అని తెలుస్తోంది. దీంతోపాటు టూటౌన్, త్రీటౌన్, ఫోర్త్‌టౌన్ పరిధిలో కూడా మట్కా నడుస్తోంది. ఇక్కడా అదే పరిస్థితి. తాడిపత్రి, కదిరి, హిందూపురం, గుంతకల్లు, ధర్మవరంలో కూడా జోరుగా సాగుతోంది. ఈ ఊబిలో కూరుకపోరుున వేలాది కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నారుు. మట్కా రాసే వారిలో కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు. పాతనోట్లతో మట్కా కొత్తపుంతలు పాతనోట్ల స్వీకరణతో మట్కా కొత్తరూపు సంతరించుకుంటోంది. ఇప్పటి వరకూ మట్కాపై రూ.వంద రాసే వ్యక్తి పాతనోట్లతో రూ.500, వెయి రాస్తున్నాడు. ఇలా రాసే మొత్తం పెరగడంతో బీటర్ల ఆదాయం భారీగా పెరిగింది. భారీవ్యాపారాలు చేస్తూ మట్కాకు బానిసలై కొన్నేళ్లుగా చీటీలు రాస్తున్నవారివద్ద భారీగా పాతనోట్లు ఉన్నాయి. వీటిని బ్యాంకులో డిపాజిట్ చేసినా ఐటీ లెక్కల ప్రకారం భారీగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. దీంతో ఒక్కొక్కరు 5 నంబర్లపై భారీగా వెచ్చిస్తున్నారు. వీరిని చూసుకుని ఇప్పటి వరకూ మట్కా అలవాటు లేని వ్యక్తులు కూడా పాతనోట్లతో ఆట మొదలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా నడుస్తున్న మట్కా వ్యాపారంలో బీటర్లు కొన్ని నంబర్లకు మాత్రమే కంపెనీలకు డబ్బు చెల్లించి తక్కిన మొత్తాన్ని వీరే స్వాహా చేస్తున్నారు. ఈ డబ్బును బెంగళూరు, బళ్లారిలో మట్కా సాగిస్తోన్న వారికి సరఫరా చేసి డబ్బులు మార్చే పనిలో ఉన్నారు. పేకాటకూ పాత నోట్లే.. మట్కాతో పాటు పేకాట కూడా జిల్లాలో జోరుగా నడుస్తోంది. పేకాటరాయుళ్లు కూడా పాతనోట్లతో ’గేమ్’ ఆడుతున్నారు. జిల్లాలో ఓ క్లబ్‌తో పాటు ఏపీబీఆర్, ఎంపీఆర్ డ్యాంల వద్ద భారీగా పేకాట ఆడుతున్నారు. కొందరు బళ్లారితో పాటు కర్ణాటక సరిహద్దు దాటి అక్కడ పేకాట ఆడుతున్నారు. ఎస్పీ దృష్టి సారిస్తే పాతనోట్లతో మట్కాసాగిస్తోన్న వ్యవహారం నగరంలోని ఓ సీఐ దృష్టికి వచ్చింది. అయితే బీటర్లను పిలిపించి, వారితో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎస్పీ మట్కా నిర్వాహకులపై దాడులు చేస్తే భారీస్థారుులో పాతనోట్లు లభించే అవకాశం ఉంది. -
నంబర్ గేమ్!
పొడుస్తున్న పొత్తులతో మారుతున్న సమీకరణలు మేజిక్ ఫిగర్‌కోసం పార్టీల ముమ్మర ప్రయత్నాలు జతకడుతున్న చిరకాల రాజకీయ ప్రత్యర్థులు ఆసక్తి రేకెత్తిస్తున్న శాసనమండలి ఎన్నికలుసాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ;శాసనమండలి సమరం ఆసక్తిని రేకెత్తిస్తోంది. జంప్‌జిలానీలు, జతకడుతున్న ప్రత్యర్థులతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. గ తేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లను సాధించింది. రెండో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్, మూడో స్థానంలో టీడీపీ నిలిచాయి. అయితే ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సమీకరణలు మారిపోయాయి. సంఖ్యాబలం లేకున్నా జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగిరింది. చాలా మంది ఎంపీటీసీలు గోడ దూకడంతో ఆ పార్టీ బలీయశక్తిగా ఎదిగింది. ఈ క్రమంలోనే అధికారపార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌తో కాంగ్రెస్, టీడీపీలు కకావికలమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల కోటాలో తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమని టీఆర్ఎస్ ఆశిస్తోంది. కాగా, తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో మండలి రాజకీయం ఉత్కంఠను కలిగిస్తోంది. ముఖ్యంగా చిరకాల రాజకీయ ప్రత్యర్థులు కాంగ్రెస్, టీడీపీలు కౌన్సిల్ ఎన్నికల్లో సర్దుబాటు చర్చలు జరుపుతుండడం అధికారపార్టీని ఒకింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ ఇరుపార్టీలు జతకడితే ఉమ్మడిగా టీఆర్ఎస్ను నిలువరించడం పెద్ద కష్టమేమీకాదు. రెండు పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు చాలా మంది కారెక్కినప్పటికీ, ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకునేందుకు సరిపడా సంఖ్యాబలం ఉంది. కూడికలు.. తీసివేతలు చేతులు కలిపితే రెండు సీట్లు గెలుచుకోవచ్చనే ఉద్దేశంతో టీడీపీ, కాంగ్రెస్‌లు ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపాయి. సిద్ధాంతాల మధ్య వైరుఢ్యం ఉన్నా.. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉమ్మడిగా టీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేయాలనే కోణంలో జిల్లా నాయకత్వాలు కలిసిపోదామని సూత్రప్రాయంగా నిర్ణయించాయి. టీడీపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న బీజేపీ కూడా అండగా నిలుస్తుందని అంచనా వేస్తోంది. దీంతో విజయం నల్లేరుపై నడకేనని భావిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాదిలో దక్కించుకున్న సీట్లకంటే ప్రస్తుతం అదనంగా 34 స్థానాలు ఉన్నట్లు లెక్క తీసింది. ఇందులో కొంతమంది చివరి నిమిషంలో ప్రత్యర్థి శిబిరంలోకి వెళ్లినా గెలుపునకు ఢోకా ఉండదని అనుకుంటోంది. అదేతరుణంలో గతంలో పార్టీ మారిన కొందరు తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ చెబుతోంది. దీనికితోడు టీఆర్ఎస్ సీనియర్లలో ఉన్న అసంతృప్తులు కూడా తమకు కలిసివస్తాయని కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే బల మైన అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపేలా వ్యూహాలకు పదు ను పెడుతోంది. జిల్లావ్యాప్తంగా స్థానిక సంస్థ ల్లో 766 మంది ప్రతినిధులుండగా, ప్రస్తుతం ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సంఖ్యా ‘బలం’ ఇలా.. పార్టీల మధ్య అవగాహన కుదిరితే పక్షాల బలాబలాలు అనూహ్యంగా మారుతాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు 236 మంది సభ్యులున్నారు. ఈ పార్టీ టీడీపీతో జతగడితే వీరి బలం 339కి పెరుగుతుంది. ఇప్పటికే టీడీ పీకి మిత్రపక్షంగా ఉన్న బీజీపీకి 44 మంది సభ్యులున్నారు. తాజా కూటమిలో బీజేపీ కూడా చేరితే వీరి సంఖ్య 383కు చేరుతుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టడంతో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు అధికారపార్టీ గూటికి చేరిపోయారు. దీంతో ప్రస్తుతం జిల్లాలో టీఆర్ఎస్ వైపు 299 మంది ప్రతినిధులున్నారు. అయితే 26 మంది సభ్యులున్న మజ్లీస్ ఎవరికి మద్దతిస్తుందనే అంశంపై ఇంకా స్పష్టతలేదు. అదేవిధంగా వామపక్ష పార్టీలకు చెందిన 12 మంది, స్వతంత్రులు 46 మంది ఏ పార్టీవైపు మొగ్గుతారో వేచిచూడాలి. -
నంబర్ గేమ్
ప్రపంచకప్ పోటీలలో ఇటు బ్యాట్లతోను, అటు బాల్ తోను ఆటగాళ్లు చెలరేగిపోయారు. ఆ నంబర్లేమిటో, ఆ గేమ్ ఏంటో చూద్దామా.. Batting Stats Top Run Scorer Martin Guptill న్యూజిలాండ్ 547 Highest Strike Rate మెకల్లమ్ న్యూజిలాండ్ 188.50 Highest Individual Score గుప్తిల్ న్యూజిలాండ్ 237* Best Average కుమార సంగక్కర శ్రీలంక 108.20 Most Centuries కుమార సంగక్కర శ్రీలంక 4 Most Fifties Steve Smith ఆస్ట్రేలియా 4 Most Sixes క్రిస్ గేల్ వెస్టిండీస్ 26 Most Fours గుప్తిల్ న్యూజిలాండ్ 59 Bowling Stats Top Wicket Taker మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా22 Best Economy మైఖేల్ క్లార్క్ ఆస్ట్రేలియా 2.80 Best Bowling Figures టిమ్ సౌతీ న్యూజిలాండ్ 7/33 Best Average మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా 10.18 Most Four Wickets మిచెల్ స్టార్క్ఆస్ట్రేలియా 2 Maidens ట్రెంట్ బౌల్ట్ న్యూజిలాండ్ 14 li:nth-of-type(2n+1) {clear: both; width: 45%; list-style: none;} .large-block-grid-4 > li { width: 45%; list-style: none;} [class*="block-grid-"] > li { display: block; height: auto; float: left; padding: 0 0.625rem 1rem; } .statsPlayerCard { background: #e59c37; position: relative; overflow: hidden; border-radius: 5px; display: block; text-decoration: none; } .statsPlayerCard .statsTitle { display: block; background: #D07F0A; padding: 10px 15px; border-radius: 5px 5px 0 0; color: #fff; position: relative; z-index: 10; } .bowler { background: #4576cc; position: relative; overflow: hidden; border-radius: 5px; display: block; text-decoration: none; } .bowler .statsTitle { display: block; background: #16469d; padding: 10px 15px; border-radius: 5px 5px 0 0; color: #fff; position: relative; z-index: 10; } .subHeading { font-weight: 700; text-transform: uppercase; font-size: 1.1em; line-height: 1em; float: none; } .statsPlayerCard .playerCardContent { padding: 15px; display: block; position: relative; z-index: 10; } .statsPlayerCard .thumbnail { display: block; position: absolute; bottom: 0; right: 10px; z-index: 10; height: 150px; overflow: hidden; transition: all 0.2s linear; } .statsPlayerCard .thumbnail .playerPhoto { display: block; margin: 0 auto; position: relative; top: 40px; } .statsPlayerCard .thumbnail img { max-width: 100px; max-height: 110px; } .statsPlayerCard .firstName { display: block; color: #fff; text-transform: uppercase; font-weight: 800; font-size: 1.1em; } .statsPlayerCard .secondName { display: block; color: #fff; text-transform: uppercase; font-weight: 800; font-size: 1.1em; line-height: 1em; } .statsPlayerCard .nationality { display: block; color: #fff; } .statsPlayerCard .count { display: block; color: #fff; text-transform: uppercase; font-weight: 800; font-size: 3em; line-height: 1em; margin-top: 5px; } ]]> -
ఆదాయం
పంచ సూత్రాలు భవిష్యత్‌లో అత్యవసర పరిస్థితుల కోసం ఎంతో కొంత పొదుపు చేయాలన్నది నిర్వివాదాంశం. కానీ అన్నింటి రేట్లు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. ఎంత ఆదాయం వచ్చినా ఏ మూలకూ సరిపోని పరిస్థితి. ఇలాంటప్పుడు పొదుపు అనేది అనుకోవడానికి మాత్రమే పరిమితమై.. ఆచరణలో పెట్టాలంటే అసాధ్యంగా ఉంటుంది. అయితే, ఇందుకోసం మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. ట్రై చేసి చూడండి.. మ్యాజిక్ వర్డ్ పెట్టుకోండి .. భవిష్యత్‌లో తలెత్తే ఏదో ఒక అవసరం కోసమని సర్ది చెప్పుకుంటూ పొదుపు విషయాన్ని ఒకోసారి అలక్ష్యం చేయొచ్చు. ఈ కాస్తే కదా అని దుబారాలు చేసే అవకాశమూ ఉంది. అలా కాకుండా ఎందుకోసం పొదుపు చేస్తున్నామన్నది నిరంతరం గుర్తుండేలా ఏదో ఒక మ్యాజిక్ పదం పెట్టుకోండి. ఉదాహరణకు వాహనం కోసం పొదుపు చేస్తున్నారనుకుందాం. అలాంటప్పుడు ఆన్లైన్ షాపింగ్‌పై అనవసర ఖర్చులు చేయకుండా పాస్వర్డ్ కింద సేవింగ్4కార్ అనో మరో లక్ష్యం అయితే దానికి తగ్గట్లుగా మరొకటో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. సదరు పాస్‌వర్డ్‌ను టైప్ చేసిన ప్రతిసారీ లక్ష్యం గుర్తుకొచ్చి.. అనవసర ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అలాగే.. షాపింగ్‌కి వెళ్లినప్పుడు గాజులో, ఇయర్ రింగ్సో మరొకటో మురిపిస్తుంటాయి. అవి మనకు నప్పవని తెలిసినప్పటికీ, అనవసరం అనిపించినప్పటికీ .. అప్పటికప్పుడు మాత్రం కొనేయాలనిపించి తెచ్చేస్తుంటాం. ఈసారి అలాంటివి కొనాలనిపించినప్పుడు.. ఆయా ఉత్పత్తుల రేటు చూసి.. అంత మొత్తాన్ని మీ అకౌంటులో నుంచి పొదుపు ఖాతాలోకి మళ్లించండి. నెల చివర్లో జమయిన దాన్ని బట్టి చూస్తే.. ఎంత వధా ఖర్చును నియంత్రించుకోగలిగారో తెలుస్తుంది. నంబర్ గేమ్ .. ఒకటి.. రెండు.. మూడు .. ఇలా ఏదో ఒక నంబరు ఎంచుకోండి. ప్రతి రోజూ రాత్రి మీ పర్సులో ఆ నంబరుతో ముగిసే కరెన్సీ నోటు ఏదైనా ఉందేమో చూసి.. దాన్ని తీసి పక్కన పెట్టండి. వారం రోజులు తిరిగేసరికి మీరు రెగ్యులర్‌గా చేసే పొదుపు మొత్తానికి ఇది అదనంగా తోడవుతుంది. సెట్ చేయండి.. వదిలేయండి.. శాలరీ అకౌంటులో జీతం పడగానే కొంత మొత్తం పొదుపు ఖాతాలోకి మళ్లే విధంగా ఆటోమేటిక్‌గా సెట్ చేసి ఉంచండి. దీంతో పొదుపు కోసం కేటాయించిన దానికి పోగా మిగిలినదే సరిపెట్టుకోవడం అలవాటవుతుంది. ముందుగా.. ఒక్క రోజు శాలరీలాగా చిన్న మొత్తంతో మొదలుపెట్టండి. క్రమక్రమంగా వెసులుబాటును బట్టి పెంచుకుంటూ పోవచ్చు. డీల్స్‌ను ఉపయోగించుకోండి.. పండుగలప్పుడు, ఇతరత్రా ప్రత్యేక సందర్భాల్లోనూ రిటైలర్లు డిస్కౌంట్లు ఇస్తుంటారు. దీన్ని కూడా పొదుపు కోసం ఉపయోగించుకోవచ్చు. ఆఫర్లలో ఏదైనా కొన్నప్పుడు .. అసలు ధర, డిస్కౌంటు ధరకు మధ్య వ్యత్యాసాన్ని పొదుపు ఖాతాలోకి జమచేసి చూడండి. ఫైన్ వేసుకోండి.. ఎంత కాదనుకున్నా ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక్కటైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. ఊసుపోక యూట్యూబ్ వీడియోల్లో మునిగిపోవడమో.. అయిన దానికి కాని దానికి అందరి మీదా అరిచేయడమో ఇలా ఏదో ఒకటి ఉండొచ్చు. ఇలా చేసిన ప్రతిసారీ మీకు మీరు ఫైన్ విధించుకుని కొంత మొత్తాన్ని డిబ్బీలో వేయండి. క్రమక్రమంగా అందులో డబ్బూ పోగవుతుంది.. ఫైన్ సంగతి గుర్తొచ్చి మెల్లమెల్లగా అలవాటునూ తగ్గించుకునే అవకాశమూ ఉంటుంది. కేవలం చెడు హ్యాబిట్సే కాకుండా మంచి అలవాట్లకు కూడా దీని వర్తింప చేసుకోవచ్చు. -
‘నంబర్’గేమ్ షురూ
సాక్షి, హైదరాబాద్: నంబర్ప్లేట్లు మార్చుకోవడానికి వాహనదారులకు చేతిచమురు వదలక తప్పేలా లేదు. పాత వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ప్లేట్ల విషయంలో ఎంతో కొంత రుసుము వసూలు చేసే దిశగా తెలంగాణ రవాణాశాఖ అడుగులేస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి కొత్త సిరీస్ వచ్చిన నేపథ్యంలో వాహనాల నంబర్ ప్లేటుపై ఏపీ అక్షరాల బదులు టీఎస్ అక్షరాలు, జిల్లా పాత కోడ్ నంబరు బదులు కొత్త కోడ్‌ను మార్చుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాటి ఆర్సీ కార్డులను కూడా మార్పించుకోవాలి. ఇందుకోసం ద్విచక్రవాహనాలకు రూ.100, కార్లు, అంతకంటే పెద్ద వాహనాలకు రూ.200 చొప్పున రుసుము వసూలు చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో విధివిధానాలు ఖరారు కానున్నాయి. తెలంగాణకు ఇటీవల కేంద్రప్రభుత్వం టీఎస్ సిరీస్‌ను కేటాయించిన నేపథ్యంలో.. ఇప్పటికే ఏపీ సిరీస్‌తో తిరుగుతున్న పాత వాహనాల నంబర్ల ప్లేట్లను కూడా టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన విధివిధానాల ఖరారులో జాప్యం జరుగుతుండటంతో వాహనదారుల్లో అయోమయం నెలకొంది. నంబర్ ప్లేట్లను మార్చాల్సిందేనని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనిపై ప్రజల అభ్యంతరాలను స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. మరో రెండుమూడు రోజుల్లో దీనిపై సమీక్షించి తుది నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. ఉచితంగా చేయాలంటే కష్టమే... ప్రస్తుతం తెలంగాణలో 73 లక్షల వాహనాలున్నాయి. వీటన్నింటి నంబర్లను తెలంగాణ సిరీస్‌లోకి మార్చాలి. నంబర్ ప్లేటుపై ఏపీ బదులు టీఎస్, జిల్లా కోడ్ సంఖ్య స్థానంలో కొత్త సంఖ్య మార్పించటం పెద్ద సమస్య కాదు. అయితే నంబర్ ప్లేటుపై జరిగిన మార్పునకు తగ్గట్టుగా అధికారిక పత్రాల్లో కూడా మార్పులు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఆర్సీ బుక్కుకు సంబంధించి మార్పు చేయాలి. ఆమేరకు వాహనదారులకు కొత్త కార్డును జారీ చేయాల్సి ఉంటుంది. 73 లక్షల వాహనదారులకు కొత్త కార్డులు జారీ చేయటం ఖర్చుతో కూడుకున్న పని అయినందున దానికి తగిన రుసుము విధించకతప్పదని అధికారులు భావిస్తున్నారు. అయితే మొత్తం భారం వాహనదారుడిపై పడకుండా ఆ రుసుము తక్కువ ఉండేలా చూడాలని యోచిస్తున్నారు. అందులో భాగంగా ద్విచక్రవాహనాలకు రూ.100, మూడు చక్రాలు, కార్లు, అంతకంటే పెద్ద వాహనాలకు రూ.200 చొప్పున రుసుము విధించవచ్చని భావిస్తున్నారు. ఇక హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల ఏర్పాటును తప్పనిసరి చేస్తూ ఇప్పటికే రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనికి ఏడాది గడువు విధించింది. ప్రస్తుతం ఏపీ సిరీస్‌తో ఉన్న 73 లక్షల వాహనాలకు ఎలాగూ ఈ నంబర్ ప్లేట్లను అమర్చుకోవాల్సి ఉంది. ఆ మొత్తాన్ని వాహనదారులు భరించాల్సిందే. అందని అభ్యంతరాలు... ఏపీ సిరీస్‌లో ఉన్న వాహనాల నంబర్ప్లేట్లను టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలంటూ ఇటీవల ఆదేశించిన ప్రభుత్వం దీనిపై అభ్యంతరాలుంటే తెలపాల్సిందిగా కూడా సూచించింది. అయితే ఈ విషయంపై సమాచారం ప్రజల్లోకి వెళ్లకపోవటంతో ఇప్పటి వరకు పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కొన్ని జిల్లాలకు సంబంధించిన లారీ అసోసియేషన్లు, కొంతమంది వ్యక్తులు మాత్రమే దీనిపై అభ్యంతరాలు అందజేశారు. సోమ, మంగళవారాల్లో ఈ తంతు కూడా ముగిసినట్టు ప్రకటించి తుది నిర్ణయం వెల్లడించాలని రవాణా శాఖ యోచిస్తోంది. అంటే సోమవారం వరకు ఎవరైనా అభ్యంతరాలుంటే వెల్లడించే అవకాశం ఉంది. రవాణాశాఖ అధికారులకు ఫోన్, లేఖలు, వినతిపత్రాల రూపంలో, లేదా నేరుగా కార్యాలయాలకు వెళ్లి మౌఖికంగా.. అభ్యంతరాలను తెలిపే అవకాశం ఉంది.