సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఎంఎస్ ధోని అవసరం కనబడిందని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. కీలకమైన కొన్ని క్యాచ్‌లను పార్థీవ్ పటేల్ వదిలేయడంతో ధోని అవసరాన్ని ఈ సందర్బంగా గావస్కర్ గుర్తు చేశాడు. 'మాజీ కెప్టెన్ ధోనీ టెస్టులను వీడాల్సింది కాదు. అతని సూచనలు, సలహాలు జట్టు సభ్యులకు ఎంతో విలువైనవి. టెస్టుల్లో కెప్టెన్సీ భారం అతనిపై అధికంగా పడి ఉంటుంది. అందుచేత టెస్టులకు పూర్తిగా గుడ్ బై చెప్పేయాల్సి వచ్చిందని అనుకుంటున్నా. కెప్టెన్ బాధ్యతలను వదులుకొని వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగితే బాగుండేది. అతను చాలా విలువైన ఆటగాడు. ధోని లేకపోవడం వల్లే టీమిండియా సిరీస్‌ను కోల్పోయింది' అని గావస్కర్ విశ్లేషించాడు. 2004లో విదేశాల్లో టెస్టు మ్యాచ్ ఆడిన పార్థీవ్‌కు చోటు కల్పించడం సరైనది కాదని గావస్కర్ పేర్కొన్నాడు.
ఏ మ్యాచ్‌లోనైనా క్యాచ్‌లు పాత్ర చాలా విలువైనది. అందులోనూ తక్కువ స్కోరు మ్యాచ్‌ల్లో క్యాచ్‌ల పాత్ర అధికంగా ఉంటుంది. రెగ్యులర్ టెస్టు కీపర్ వృద్ధిమాన్ సాహా గాయపడటంతో సెంచూరియన్‌లో టెస్టులో వికెట్ కీపర్‌గా పార్ధీవ్ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కాగా, వచ్చిన అవకాశాన్ని పార్థీవ్ దుర్వినియోగం చేసుకున్నాడు. సునాయాసమైన క్యాచ్‌లను ఒడిసిపట్టడంలో విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ ఎల్గర్(61) క్యాచ్‌తో పాటు మొదటి ఇన్నింగ్స్‌లో ఆమ్లా(82), డు ప్లిసిస్(63) క్యాచ్‌లను పార్థీవ్ జారవిడిచాడు. మరొకవైపు బ్యాట్స్‌మన్‌గా కూడా పార్థీవ్ పేలవమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోకలిపి 38 పరుగులు మాత్రమే సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment