
ముంబై, ఢిల్లీ మ్యాచ్ డ్రా
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీ, ఢిల్లీ డైనమోస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఇరు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యారుు. ఈ మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు చక్కగా పోరాడారు. తొలి 45 నిమిషాల్లోనే గోల్‌పోస్ట్ లక్ష్యంగా ఆరు షాట్లు కొట్టారు. కానీ ఢిల్లీ మాత్రం ఒకే ఒక్క ప్రయత్నం చేయగలిగింది.
ఈ రెండు జట్లు ఇది వరకే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించారుు. ముంబై 23 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలువగా... ఢిల్లీ 21 పారుుంట్లతో రెండో స్థానంలో ఉంది. కొచ్చిలో నేడు (ఆదివారం) కేరళ బ్లాస్టర్స్, నార్త్ ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీల మధ్య జరిగే చివరి మ్యాచ్‌తో లీగ్ దశ ముగియనుంది.