సూపర్ లీగ్‌కు నల్లగొండ | Nalgonda team entered super league tournment | Sakshi
Sakshi News home page

సూపర్ లీగ్‌కు నల్లగొండ

Published Wed, Feb 5 2014 1:15 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

సూపర్ లీగ్‌కు నల్లగొండ - Sakshi

సాక్షి, నల్లగొండ: తెలంగాణ అంతర్ జిల్లా పురుషుల సీనియర్ హాకీ టోర్నమెంట్‌లో ఆతిథ్య నల్లగొండ జట్టు సూపర్‌లీగ్‌లోకి ప్రవేశించింది. నల్లగొండతో పాటు నిజామాబాద్, వరంగల్ కూడా ఈ దశకు అర్హత సాధించాయి. ఇక్కడి ఎన్జీ కాలేజీ మైదానంలో జరుగుతున్న ఈ పోటీల లీగ్ దశలో పై మూడు జట్లు నిలకడగా రాణించాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నల్లగొండ 6-0 గోల్స్ తేడాతో రంగారెడ్డిని చిత్తు చేసింది. ఎండీ అజీజ్, లచ్చు చెరో 3 గోల్స్ చేసి నల్లగొండకు విజయాన్ని అందించారు.
 
 మరో మ్యాచ్‌లో నిజామాబాద్ 3-2 తేడాతో ఆదిలాబాద్‌ను ఓడించింది.  రెండో లీగ్ మ్యాచ్‌లో కూడా చెలరేగిన నిజామాబాద్ 6-0 తేడాతో మహబూబ్‌నగర్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో వరంగల్ 3-1తో మెదక్‌పై విజయం సాధించి సూపర్‌లీగ్‌కు చేరుకుంది. టోర్నీ చివరి రోజు బుధవారం సూపర్ లీగ్‌లో భాగంగా ఒక్కో జట్టు ఇతర రెండు జట్లతో తలపడుతుంది. ఈ ప్రదర్శన తర్వాతే (సెమీస్, ఫైనల్ లేకుండా) టోర్నీ విజేతను నిర్ణయిస్తారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement