సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ రేపటి నుంచి ఆరు రోజుల పాటు నగర అభిమానులను అలరించనుంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో ఆదివారం నుంచి శుక్రవారం వరకు ఈ పోటీలు జరుగనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. శుక్రవారం ఒలింపిక్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ కబడ్డీ టోర్నీ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్ స్మారకార్థం ఏర్పాటు చేసిన కబడ్డీ అకాడమీని నేడు ప్రారంభిస్తామన్నారు.
రాష్ట్ర జట్ల వివరాలు
పురుషులు: ఎం. మహేందర్ రెడ్డి (కెప్టెన్), జి. మల్లేశ్, జి. జీవా, ఎస్. భాస్కర్, సామ నిరీక్షణ్ రెడ్డి, ఎస్‌కే అమీర్, కె. శివయ్య, ప్రదీప్, ఎస్. కిషోర్, మునీశ్ కుమార్, కె. రవీంద్ర రమేశ్, భరత్ జాదవ్, ఎ. గౌరీ శంకర్, లక్ష్మీనారాయణ, కె. జగ్‌మోహన్ (చీఫ్ కోచ్), ఎస్. వెంకటేశ్ (కోచ్), ఎ. గౌరీ శంకర్ (మేనేజర్)
మహిళలు: కె. మహేశ్వరి (కెప్టెన్), ఆర్. అఖిల, షేక్ నౌషీన్, కె. ప్రియాంక, మొహమ్మద్ సనా, బి. ప్రవళిక, వి. మౌనిక, ఆర్. కవిత, కె. మౌనిక, పి. సౌందర్య, టి. కావేరి, జి. ఆదిలక్ష్మి, ఎం. రేణుక, రత్నకుమారి, ఎన్. సుధాకర్ రావు (కోచ్), పి. సతీశ్ కుమార్ (మేనేజర్).
Comments
Please login to add a commentAdd a comment