బాచుపల్లిలోని కబడ్డీ అకాడమీని ప్రారంభిస్తున్న అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్దన్‌సింగ్ గెహ్లాట్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జనార్దన్ సింగ్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ టోర్నీలో ప్రొ కబడ్డీ లీగ్ క్రీడాకారులు కూడా తలపడుతున్నారు. వీరితో పాటు 29 రాష్ట్రాలకు చెందిన ప్లేయర్లు పోటీపడుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత అమెచ్యూర్ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు మృదుల్, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపాటి గాంధీ, కిషన్ రెడ్డి, శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రెడ్డి, కార్యదర్శి కె. జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
కబడ్డీ అకాడమీ ప్రారంభం: కబడ్డీలో రాణించాలనుకునే నగర వాసులకు కబడ్డీ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఏర్పాటు చేసిన ఈ అకాడమీ ఆదివారం ప్రారంభమైంది. తన తమ్ముడు కాసాని కృష్ణ ముదిరాజ్ జ్ఞాపకార్థం బాచుపల్లిలో ఈ అకాడమీని ఏర్పాటు చేశారు. కబడ్డీని కెరీర్‌గా ఎంచుకునే క్రీడాకారులకు ఎంతో ఉపయుక్తమైన ఈ అకాడమీని అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షుడు జేఎస్ గెహ్లాట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment