
ఒంటారియో: ఇటీవల కాలంలో ట్వీటర్‌లో ఆసక్తికర పోస్టులు చేస్తున్న క్రికెటర్లలో న్యూజిలాండ్ ఆటగాడు జేమ్స్ నీషమ్ ఒకడు. వరల్డ్‌కప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరినా, అదృష్టం కలిసి రాకపోడంతో విశ్వ విజేతగా నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఆ క్రమంలోనే ఎవరూ క్రీడలను ఎంచుకోవద్దని తనలోని ఆవేదనను వ్యక్తం చేశాడు. క్రీడల్ని తప్ప మిగతా ఏ రంగాన్నైనా ఎన్నుకోండి అంటూ పిల్లలకు సూచించాడు. ఇలా ఏ సందర్భలోనైనా తనదైన రీతిలో సమాధానాలిస్తూ సోషల్ మీడియాలో నీషమ్ తరచు వార్తలో ఉంటున్నాడు. తాజాగా తమ దేశం వస్తే ఒక మంచి బిర్యానీ పెట్టిస్తామన్న పాక్ అభిమానులకు కొంటెగా సమాధానమిచ్చాడు నీషమ్.
డిన్నర్, బీర్స్ కోసం టోరంటోలోనే ఏమైనా ప్రతిపాదనలు ఉంటే చెప్పండి. అది కూడా ఓపెన్ టాప్ బార్‌లో అయితే బాగుంటుంది* అని నీషమ్ ముందుగా ట్వీట్ చేశాడు. దీనికి పాక్ అభిమానులు స్పందిస్తూ.. ‘నీషమ్.. మీరు మా దేశం వచ్చి బిర్యానీని ఆరగించండి. పాకిస్తాన్ బిర్యానీ అంటే వరల్డ్‌లోనే అత్యుత్తమ వంటకం. మా దేశ బిర్యానీని మీకు వడ్డించే అవకాశం ఇవ్వండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు నీషమ్ ట్విటర్‌లోనే స్పందిస్తూ..‘ బిర్యానీ కోసం పాక్ వరకూ ఎందుకులే. పాక్ చాలా దూరం కదా’ అని అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆడుతున్న నీషమ్.. టోరంటోలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment