
కోహ్లికి విశ్రాంతి నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యం వహించనున్న టి20 సిరీస్‌కు మూడు కొత్త ముఖాలకు చోటు దక్కింది. కేరళ ఫాస్ట్ బౌలర్, యార్కర్ల స్పెషలిస్ట్ బాసిల్ థంపి, తమిళనాడు ఆఫ్ స్పిన్ ఆల్‌రౌండర్ 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్‌తో పాటు హరియాణాలో జన్మించి రంజీల్లో బరోడాకు ఆడుతున్న దీపక్ హుడా లంకతో సిరీస్‌కు ఎంపికయ్యారు. గతేడాది చివరి టి20 ఆడిన జయదేవ్ ఉనాద్కట్‌కు మరోసారి పిలుపురాగా... హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చోటు నిలబెట్టుకున్నాడు. తొలి టి20 డిసెంబర్ 20న కటక్‌లో జరగనుంది.
భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ధోని, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, సిరాజ్, బాసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కట్.
దక్షిణాఫ్రికా సిరీస్‌కు వెళ్లిన గత జట్లతో పోలిస్తే ఇది సమతూకమైన జట్టు. ఫామ్ ఆధారంగానే ఆటగాళ్ల ఎంపిక జరిగింది. ఏడాదిన్నరగా రంజీలు, వన్డేలు, టి20ల్లో బుమ్రా అద్భుతంగా రాణించాడు. అతడిది ఏకగ్రీవ ఎంపిక. అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై పేస్ విభాగంలో అతడు వైవిధ్యాన్ని తీసుకొస్తాడు. కుల్దీప్ మంచి బౌలరే. అశ్విన్, జడేజా ఉండటంతో అవకాశం దక్కలేదు. సుదీర్ఘ పర్యటన కారణంగా పార్థివ్‌ను రెండో కీపర్‌గా తీసుకున్నాం. టి20 జట్టు విషయానికొస్తే... శ్రేయస్ అయ్యర్, థంపి రంజీలతో పాటు దక్షిణాఫ్రికాలో భారత ‘ఎ’ పర్యటన, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబర్చారు. థంపి పొట్టి క్రికెట్‌కు మరింత మెరుగైన ఆటగాడు. – ఎమ్మెస్కే ప్రసాద్, చీఫ్ సెలక్టర్
Comments
Please login to add a commentAdd a comment