మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని ఆదివారం(జూలై 7న) పుట్టిన రోజు జరుపుకున్న సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన ట్వీట్‌పై న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ స్పందించాడు. ‘ విష్ యూ హ్యాపీ బర్త్ డే ఎంఎస్ ధోని., హేవ్ ఏ గ్రేట్ ఇయర్. ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ టూ గేమ్స్’ అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. దీనికి ధోనితో కలిసి ఉన్న ఫొటోనే ట్వీట్ చేశాడు సచిన్. దీనిపై గ్యారీ స్పందిస్తూ.. ‘ ధోని మిగతా రెండు మ్యాచ్‌లు ఆడొచ్చు. అయితే అది కచ్చితంగా జరుగుతుందో లేదో చెప్పలేను. కానీ త్వరలో తమ జట్టులో ఉన్న ఆటగాళ్ల పుట్టినరోజు కూడా వస్తుంది. వాళ్లకు కూడా సచిన్ నుంచి అదే తరహా విషెస్ వస్తాయని ఆశిస్తున్నా’ అని అన్నాడు. (ఇక్కడ చదవండి: ఆ రెండు జట్లే ఫైనల్లో తలపడేవి: పీటర్సన్)
ధోనీ ఆ రెండు మ్యాచ్ లు ఆడతాడని తాను కూడా భావిస్తున్నానని చెప్పాడు. అయితే... అది నిజంగా జరుగుతుందో లేదో మాత్రం తనకు లేదన్నాడు. మా జట్టు కుర్రాళ్లది కూడా త్వరలో పుట్టిన రోజు రాబోతోంది. వాళ్లకు కూడా ఇలాంటి విషెస్ వస్తాయని భావిస్తున్నాను అంటూ న్యూజిలాండ్ కోచ్ పేర్కొన్నాడు. తమ జట్టు గురించి అసలు ఏమనుకుంటున్నారో అనే విషయం గురించి తాను పెద్దగా ఆందోళన చెందడం లేదన్నాడు. తాము ఏమిటన్నది ఆటగాళ్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని గ్యారీ తెలిపాడు. మరొకవైపు భారత జట్టుపై ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఒక నాణ్యమైన జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదని, ఆ జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్స్ ఉన్నారంటూ కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment