న్యూఢిల్లీ: క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ. వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ ఎలెవన్ జట్లను ప్రకటించగా, తాజాగా తన వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టు ఇదేనంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెల్లడించాడు. ఇందులో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌కు తన జట్టు సారథిగా ఎంపిక చేసిన సచిన్.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రాలకు భారత్ నుంచి చోటు కల్పించాడు.
ఇక ఇంగ్లండ్ నుంచి బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టోలను ఎంపిక చేసిన సచిన్.. బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్‌కు తన జట్టులో అవకాశం ఇచ్చాడు. ఆసీస్ నుంచి మిచెల్ స్టార్క్‌ను మాత్రమే తన అత్యుత్తమ వరల్డ్‌కప్ ఎలెవన్ జట్టులో చోటిచ్చాడు. కాగా, సచిన్ జట్టులో ఎంఎస్ ధోనికి చోటు దక్కకపోవడం గమనార్హం.
2019 క్రికెట్ వరల్డ్‌కప్ సచిన్ ఎలెవన్ ఇదే..
కేన్ విలియమ్సన్(కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్ స్టో(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, బుమ్రా, జోఫ్రా ఆర్చర్
Comments
Please login to add a commentAdd a comment