వెల్లింగ్టన్: శ్రీలంక బ్యాట్స్‌మెన్ పోరాటానికి వర్షం అడ్డుపడింది. చివరకు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. బుధ వారం ఆఖరి రోజు కేవలం 13 ఓవర్ల ఆటే సాధ్యపడింది. ఈ ఓవర్లలోనూ ఆతిథ్య కివీస్ బౌలర్లు కుశాల్ మెండిస్ (141 నాటౌట్; 16 ఫోర్లు), మాథ్యూస్ (129 నాటౌట్; 11 ఫోర్లు) జోడీని విడగొట్టలేకపోయారు. వీళ్లిద్దరు అజేయమైన నాలుగో వికెట్‌కు 274 పరుగులు జోడించారు. వర్షంతో మ్యాచ్ ముగిసే సమయానికి శ్రీలంక 115 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌ల్లో శ్రీలంక 282 పరుగులు చేసి ఆలౌట్ కాగా, న్యూజిలాండ్ 578 పరుగుల భారీస్కోరు చేసింది. 13 పరుగులకే 3 టాపార్డర్ వికెట్లను కోల్పోయిన లంకపై ఆతిథ్య జట్టు గెలవాల్సింది. కానీ రోజంతా బ్యాటింగ్ చేయడం ద్వారా మాథ్యూస్, మెండిస్ కివీస్ విజయావకాశాలకు గండికొట్టారు. చివరిదైన రెండో టెస్టు ఈ నెల 26 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతుంది.
కివీస్, లంక తొలి టెస్టు డ్రా
Published Thu, Dec 20 2018 1:07 AM | Last Updated on Thu, Dec 20 2018 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment