నిరాశపరిచిన బ్రెజిల్ సాకర్ స్టార్ | Neymar fails at Rio Olympics to score atleat goal | Sakshi
Sakshi News home page

నిరాశపరిచిన బ్రెజిల్ సాకర్ స్టార్

Published Fri, Aug 5 2016 8:42 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

నిరాశపరిచిన బ్రెజిల్ సాకర్ స్టార్

నిరాశపరిచిన బ్రెజిల్ సాకర్ స్టార్

రియోడిజనీరో: బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ నెయ్‌మార్ ఆశించిన రీతిలో రాణించకపోవడంతో ఒలింపిక్స్‌లో తమ తొలి మ్యాచ్‌ను బ్రెజిల్ జట్టు డ్రా చేసుకుంది. గ్రూప్ ఎ లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ చివరికి 0-0తో ముగిసింది. ఇరు జట్ల నుంచి గోల్స్ కోసం ఆటగాళ్లు ఎంత ప్రయత్నించినా కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. ప్రథమార్ధంలో నెయ్‌మార్ రెండు షాట్లను ప్రత్యర్థి గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత బ్రెజిల్ మాత్రమే కాదు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గోల్ పోస్ట్ లోకి బంతిని ఒక్కసారి కూడా చేర్చలేకపోవడంతో ఎలాంటి గోల్ నమోదు కాకుండా మ్యాచ్ డ్రా అయింది.

ఇదే గ్రూపులో ఇరాక్, డెన్మార్క్ మ్యాచ్ కూడా గోల్స్ లేకుండా డ్రాగా ముగిసింది. గ్రూప్ బి లో నైజీరియా 5-4తో జపాన్‌పై గెలవగా, స్వీడన్ 2-2తో కొలంబియాతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. గ్రూప్ సి లో జర్మనీ, మెక్సికో మ్యాచ్ 2-2తో డ్రా కాగా దక్షిణ కొరియా 8-0తో ఫిజీపై ఘనవిజయం సాధించింది. గ్రూప్ డిలో హోండురస్ 3-2తో అల్జీరియాపై, మరో మ్యాచ్ లో పోర్చుగల్ 2-0తో అర్జెంటీనాపై నెగ్గాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement