నెమార్‌ ఆడటం అనుమానమే? | Neymar is Not 100 Percent  Fit For Brazil First Match | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 17 2018 7:46 PM | Last Updated on Mon, Jun 18 2018 12:39 PM

Neymar is Not 100 Percent  Fit For Brazil First Match - Sakshi

బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ నెమార్‌ నేడు స్విట్జర్లాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆడటం అనుమానంగానే కనిపిస్తుంది. బ్రెజిల్‌ కోచ్‌ అడెనార్‌ బాకీ (టిటె) మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి ఈ స్టార్‌ ఆటగాడు నేటి మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశముంది. నెమార్‌ వంద శాతం ఫిట్‌గా లేడని, మ్యాచ్‌ ఆడే సమయం వరకూ చెప్పలేమని టిటె పేర్కొనడంతో బ్రెజిల్‌ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. నెమార్‌ ఆడకపోయినా తమ జట్టు సమిష్టిగా రాణించగలదని టిటె విశ్వాసం వ్యక్తం చేశారు.  

ఫిబ్రవరిలో కాలికి శస్త్రచికిత్స చేయించుకున్న నెమార్‌ ప్రపంచకప్‌ ముందు జరిగిన లీగ్‌ మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చలేదు. కానీ ప్రపంచకప్‌ వార్మప్‌ మ్యాచ్‌ల్లో, ప్రాక్టీసులో ఉత్సాహంగా కనిపించడంతో అభిమానుల్లో ఆశ మొదలైంది. ఇక టిటె ప్రకటించిన పిడుగు లాంటి వార్తతో అభిమానుల ఆశ ఆవిరైంది. ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌ లేకుండా నేటి మ్యాచ్‌లో బ్రెజిల్‌ గెలవొచ్చు కానీ కప్‌ గెలవలేదని అతడి అభిమానులు పేర్కొంటున్నారు. గత ప్రపంచకప్‌లో కూడా నెమార్‌ గాయపడి సెమీఫైనల్‌ ఆడకపోవటంతో ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఇక నెమార్‌ లేకుండా బ్రెజిల్‌ ఆడే మ్యాచ్‌లకు మజానే ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.    
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement