సాక్షి, హైదరాబాద్: సదరన్ రీజియన్ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ రీజియన్ కబడ్డీ టోర్నమెంట్‌లో నార్తర్న్ రీజియన్ సత్తా చాటింది. యూసుఫ్‌గూడలోని కేవీబీఆర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో నార్నర్న్ రీజియన్-2 విజేతగా నిలిచింది. దేశవ్యాప్తంగా పలు రీజియన్లకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో నార్తర్న్ రీజియన్-1 రన్నరప్‌గా నిలవగా... వెస్ట్రన్ రీజియన్ మూడో స్థానంతో సంతృప్తిపడింది. మొత్తం మూడు రోజుల పాటు ఈ టోర్నమెంట్ జరిగింది.
నార్తర్న్ రీజియన్‌కు టైటిల్
Published Sat, Oct 1 2016 10:31 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement
Advertisement