సెమీస్‌లో ఎస్‌సీఆర్, ఎస్‌బీఐ | scr, sbi enter semis in inter departmental kabaddi tourny | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఎస్‌సీఆర్, ఎస్‌బీఐ

Published Sat, Sep 24 2016 12:14 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

scr, sbi enter semis in inter departmental kabaddi tourny

ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కబడ్డీ టోర్నమెంట్


 సాక్షి, హైదరాబాద్: వార్షిక ఎ- లీగ్ ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో ఎస్‌సీఆర్, ఎస్‌బీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్, ‘సాయ్’ ఎస్‌టీసీ జట్లు సెమీస్‌లోకి ప్రవేశించాయి. ఎల్‌బీ స్టేడియంలోని కబడ్డీ గ్రౌండ్‌‌సలో శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో ఎస్‌సీఆర్ జట్టు 25-9 తో ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టుపై అలవోకగా విజయాన్ని సాధించి సెమీఫైనల్‌కు చేరింది.

 

ఈ మ్యాచ్‌లో ఎస్‌సీఆర్ జట్టు తరఫున రైడింగ్‌లో మల్లికార్జున, ఎస్‌కే అమీర్ రైడింగ్‌లో సత్తా చాటగా... ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టులో మల్లేశ్ రాణించాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఎస్‌బీఐ జట్టు 18-14తో ఆర్టిలరీ సెంటర్‌పై, ఇన్‌కమ్ ట్యాక్స్ జట్టు 40-15తో హెచ్‌ఏఎల్ జట్టుపై విజయం సాధించాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement