
బీసీసీఐ అధ్యక్ష పదవికి నాకు అర్హత లేదు: గంగూలీ
శశాంక్ మనోహర్ స్థానంలో బీసీసీఐ అధ్యక్ష పదవికి చాలామంది అనుభవజ్ఙులు అందుబాటులో ఉన్నారని, తనకు ఆ పదవి గురించి ఆలోచన లేదని బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షడు సౌరవ్ గంగూలీ చెప్పారు. బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే కనీసం మూడు ఏజీఎంలకు హాజరు కావాలని, కాబట్టి తనకు అర్హత లేదని భారత మాజీ కెప్టెన్ స్పష్టం చేశారు.