
ఇండియన్ వెల్స్ (అమెరికా): ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్లకు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్‌లో జొకోవిచ్ (సెర్బియా) మూడో రౌండ్లో, మహిళల ఈవెంట్‌లో నయోమి ఒసాకా (జపాన్) ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
జొకోవిచ్ 4–6, 4–6తో కోల్‌ష్రైబర్ (జర్మనీ) చేతిలో కంగుతిన్నాడు. రెండో ర్యాంకర్ నాదల్ 6–3, 6–1తో స్వాట్జ్‌మన్ (అర్జెంటీనా)పై గెలుపొందగా, ఫెడరర్ 6–3, 6–4తో తన దేశానికే చెందిన వావ్రింకాపై నెగ్గాడు. మహిళల ప్రపంచ నంబర్‌వన్ ఒసాకా 3–6, 1–6తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. రెండో సీడ్ హలెప్ (రొమేనియా) 2–6, 6–3, 2–6తో మర్కెట (చెక్ రిపబ్లిక్) చేతిలో కంగుతింది.
Comments
Please login to add a commentAdd a comment