వరల్డ్ నంబర్.1ను హడలెత్తించాడు! | Novak Djokovic survives scare, tops Gilles Muller in Rogers Cup | Sakshi
Sakshi News home page

వరల్డ్ నంబర్.1ను హడలెత్తించాడు!

Published Thu, Jul 28 2016 10:43 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

వరల్డ్ నంబర్.1ను హడలెత్తించాడు!

వరల్డ్ నంబర్.1ను హడలెత్తించాడు!

టొరంటో: సెర్బియా సంచలనం, ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ నోవాక్ జొకోవిచ్ కాస్త తడ బడ్డాడు. టొరంటో టెన్నిస్ ఈవెంట్ రోజర్స్ కప్ లో బుధవారం జరిగిన మ్యాచ్ లో లగ్జెంబర్గ్ కు చెందిన ప్రత్యర్థి గిల్స్ ముల్లర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో ఓ దశలో వెనకంజ వేసినా చివరికి 7-5, 7-6(3) తేడాతో నెగ్గి  ఊపిరి పీల్చుకున్నాడు. సెర్బియా యోధుడు టొరంటో టెన్నిస్ టోర్నీ, మాంట్రియల్ 2007, 2011, 2012లలో గెలుపొందాడు. మ్యాచ్ ఓడినప్పటికీ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. మరోవైపు ఈ ఏడాది మార్చి తర్వాత హార్డ్ కోర్ట్ పై జొకో ఆడిన తొలి మ్యాచ్ కావడం విశేషం.

అన్ సీడెడ్ ఆటగాడు ముల్లర్ సర్వీస్ ఎదుర్కోవడానికి వరల్డ్ చాంపియన్ తీవ్రంగా శ్రమించాడు. అయితే ముల్లర్ చేసిన తప్పిదాలను స్కోర్లుగా మలుచుకుని జొకోవిచ్ రెండు సెట్లు కైవసం చేసుకున్నాడు. లేకపోతే అనామకుడి చేతిలో ఓడిపోయి పరాభవం చెందేవాడు. ఓటమి బాధతో రియో ఒలింపిక్స్ లో పాల్గొనాల్సి వచ్చేది. మూడో రౌండ్ లో చెక్ రిపబ్లిక్ కు చెందిన రాడెక్ స్టెఫానెక్ తో తలపడనున్నాడు. మూడో సీడ్ ఆటగాడు నిషికోరి(జపాన్) 6-4, 7-5 తేడాతో అమెరికాకు చెందిన డెన్నిస్ నోవికొవ్ పై నెగ్గాడు. మరో మ్యాచ్ లో నాలుగో సీడెడ్ మిలోస్ రొనిక్(కెనడా) 6-3, 6-3 తో తైవాన్ కు చెందిన లు యెన్సున్ పై గెలుపొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement