కివీస్ 324/7 డిక్లేర్ | NZ declare at 324 against mumbai | Sakshi
Sakshi News home page

కివీస్ 324/7 డిక్లేర్

Published Fri, Sep 16 2016 3:48 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

కివీస్ 324/7 డిక్లేర్

కివీస్ 324/7 డిక్లేర్

ఢిల్లీ: భారత్లో సుదీర్ఘ క్రికెట్ సిరీస్లో భాగంగా ముంబై జట్టుతో  వార్మప్ మ్యాచ్ ఆడుతున్న న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ను 324/7 వద్ద డిక్లేర్ చేసింది. టాస్ గెలిచిన ముంబై జట్టు తొలుత కివీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ గప్టిల్(15) వికెట్ను తొందరగానే కోల్పోయినప్పటికీ, మరో ఓపెనర్ లాథమ్(55 రిటైర్డ్ అవుట్ ;97 బంతుల్లో 10 ఫోర్లు,1 సిక్స్) ఆకట్టుకున్నాడు.

 

ఆ తరువాత ఫస్ట్ డౌన్లో వచ్చిన కెప్టెన్ విలియమ్సన్(50;56 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఇక న్యూజిలాండ్ మిగతా ఆటగాళ్లలో రాస్ టేలర్(41), సాంట్నార్(45) లు రాణించగా, నికోలస్ (29), వాట్లింగ్(21 రిటైర్డ్ అవుట్),  క్రెయిగ్(33 నాటౌట్), సోథీ(29 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడారు. ముంబై బౌలర్లలో సంధూ రెండు వికెట్లు సాధించగా, దబోల్కర్, గోహిల్, లాడ్లకు తలో వికెట్ లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement