నంబర్‌వన్‌గా డివిలియర్స్‌ | ODI player rankings AB de Villiers's number 1 | Sakshi
Sakshi News home page

నంబర్‌వన్‌గా డివిలియర్స్‌

Published Sat, Mar 11 2017 12:46 AM | Last Updated on Wed, May 29 2019 2:49 PM

ODI player rankings AB de Villiers's number 1

దుబాయ్‌: అంతర్జాతీయ వన్డే ఆటగాళ్ల ర్యాంకింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ మరోసారి నంబర్‌వన్‌గా నిలిచాడు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించిన అతను 262 పరుగులు సాధించాడు. దీంతో ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ను వెనక్కినెట్టి అతను 875 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు.

వార్నర్‌ అతడికన్నా నాలుగు పాయింట్లు తక్కువగా ఉన్నాడు. 2010లో తొలిసారిగా అగ్రస్థానం దక్కించుకున్న డివిలియర్స్‌కు ఈ స్థానంలో నిలవడం ఇది పదోసారి కాగా.. 2009 నుంచి టాప్‌–5లోనే కొనసాగుతుండటం విశేషం. రెండు నెలల క్రితం అతను ఈ స్థానాన్ని విరాట్‌ కోహ్లికి కోల్పోయాడు. భారత కెప్టెన్‌ ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement