
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికా వరల్డ్‌కప్ జట్టులో తాను పునరాగమనం కోసం ప్రయత్నం చేశాననే వార్తలను ఆ దేశ మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఖండించాడు. ఆఖరి నిమిషంలో వరల్డ్‌కప్ జట్టులోకి రావడానికి తాను ఎటువంటి డిమాండ్ చేయలేదంటూ స్పష్టం చేశాడు. వరల్డ్‌కప్ సమయంలో సఫారీ జట్టులోకి తిరిగి ఎంట్రీ ఇవ్వాలని డివిలియర్స్ ప్రయత్నం చేశాడంటూ పెద్ద దుమారమే రేగింది. దీనిపై డివిలియర్స్ ఎట్టకేలకు మౌనం వీడాడు.
‘నేను తిరిగి జట్టులోకి రావడానికి ఎటువంటి డిమాండ్ చేయలేదు. ప్రపంచకప్ టీమ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. అసలు ఎన్నడూ అలా భావించలేదు’ అని డివిలియర్స్ చెప్పాడు. అయితే, రిటైర్మెంట్‌ను ప్రకటించిన రోజు తనకు వరల్డ్‌కప్ ఆడే అవకాశం ఉంటుందా? అని వ్యక్తిగతంగా అడిగానని డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా, కెప్టెన్ డుప్లెసితో మాట్లాడినప్పుడు ఎంతో అవసరమైతేనే తాను అందుబాటులో ఉంటానని స్పష్టం చేశానన్నాడు.
కానీ, వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఓటమి అనంతరం తమ మధ్య జరిగిన వ్యక్తిగత సంభాషణ బయటకు రావడం ఎంతో బాధించిందన్నాడు. జట్టు వైఫల్యం నుంచి దృష్టి మరల్చడానికే ఎవరో ఈ సమాచారాన్ని లీక్ చేశారని డివిలియర్స్ చెప్పాడు. 2018, మే నెలలో తాను అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పానని, కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట నిర్ణయం తీసుకున్నానన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment