భారత్ ఎలా దాడి చేస్తుందో తెలుసు
సెయింట్ కిట్స్: స్పిన్ బాగా ఆడటంపైనే తమ జట్టు ఫోకస్ చేస్తోందని వెస్డిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్వైట్ అంటున్నాడు. ఎందుకంటే భారత్ లోని స్డేడియాలు ఎలా ఉంటాయి.. అక్కడ తాము ఎలా ఆడామో అచ్చం అదేవిధంగా తమ సొంత మైదానాలలో ఆడతామని ధీమా వ్యక్తంచేశాడు. కరీబియన్ పిచ్లు దాదాపు భారత్ లోని పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని, వీటి మధ్య భారీ వ్యత్యాసం లేదని అభిప్రాయపడ్డాడు. భారత్ లో ఆడిన అనుభవం తమకు ప్లస్ పాయింట్ అయినప్పటికీ, జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు ఉండటం విండీస్కు కాస్త ప్రతికూలమంటున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో స్పిన్నర్లు జడేజా, అశ్విన్ రాణించారు.
ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో 2-0తేడాతో విండీస్ ఓటమిపాలైంది. బ్రాత్వైత్ ఆసీస్ పై మెల్ బోర్న్లో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులు, సిడ్నీలోనూ 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ లోని పరిస్థితులు తమ దేశంలో ఉండవని, భారత్తో కాస్త అనుకూలించే వాతావరణం ఉందన్నాడు. స్లో పిచ్ లపై టీమిండియా ప్రధానాస్త్రం స‍్పిన్ అని మాకు తెలుసు. స్పిన్నర్లు మా బ్యాట్స్మన్లపై ఎదురుదాడికి దిగుతారు. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయన్నాడు. కీమర్ రోచ్ కాస్త ఫిట్ నెస్ సమస్యలతో సతమతమవుతుండగా, మరో స్టార్ పేసర్ జేరోమ్ టేలర్ టెస్ట్ కెరీర్కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే.