West Indies Board Presidents XI
-
భారత్ ఎలా దాడి చేస్తుందో తెలుసు
సెయింట్ కిట్స్: స్పిన్ బాగా ఆడటంపైనే తమ జట్టు ఫోకస్ చేస్తోందని వెస్డిండీస్ ఆల్ రౌండర్ కార్లోస్ బ్రాత్‌వైట్ అంటున్నాడు. ఎందుకంటే భారత్ లోని స్డేడియాలు ఎలా ఉంటాయి.. అక్కడ తాము ఎలా ఆడామో అచ్చం అదేవిధంగా తమ సొంత మైదానాలలో ఆడతామని ధీమా వ్యక్తంచేశాడు. కరీబియన్ పిచ్‌లు దాదాపు భారత్ లోని పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయని, వీటి మధ్య భారీ వ్యత్యాసం లేదని అభిప్రాయపడ్డాడు. భారత్ లో ఆడిన అనుభవం తమకు ప్లస్ పాయింట్ అయినప్పటికీ, జట్టులో అనుభవం లేని ఆటగాళ్లు ఉండటం విండీస్‌కు కాస్త ప్రతికూలమంటున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో స్పిన్నర్లు జడేజా, అశ్విన్ రాణించారు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ లో 2-0తేడాతో విండీస్ ఓటమిపాలైంది. బ్రాత్‌వైత్ ఆసీస్ పై మెల్ బోర్న్లో జరిగిన మ్యాచ్ లో 59 పరుగులు, సిడ్నీలోనూ 69 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆసీస్ లోని పరిస్థితులు తమ దేశంలో ఉండవని, భారత్‌తో కాస్త అనుకూలించే వాతావరణం ఉందన్నాడు. స్లో పిచ్ లపై టీమిండియా ప్రధానాస్త్రం స్పిన్ అని మాకు తెలుసు. స్పిన్నర్లు మా బ్యాట్స్మన్లపై ఎదురుదాడికి దిగుతారు. అయితే గతంతో పోల్చితే ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయన్నాడు. కీమర్ రోచ్ కాస్త ఫిట్ నెస్ సమస్యలతో సతమతమవుతుండగా, మరో స్టార్ పేసర్ జేరోమ్ టేలర్ టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. -
బౌన్సర్‌తో వికెట్ పడగొట్టాను..
సెయింట్ కిట్స్: వెస్డిండీస్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టుకు ఎంపికైన బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒకడు. కరీబియన్ పిచ్ లలో ఎక్కువగా స్లో బంతులకు వికెట్లు పడగొట్టొచ్చు అంటున్నాడు. అయితే తాను తీసిన వికెట్ మాత్రం బౌన్సర్ తో సాధ్యమైందన్నాడు. జూన్ 21న విండీస్ తో భారత్ తొలి టెస్టు ఆడనుంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లతో లైన్ అండ్ లెంగ్త్ బంతులపై అవగాహనా పెరిగిందన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే కుప్పకూలిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 86 ఓవర్లు ఆడి ఆరు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లలో చోటు దక్కకున్నా, ఇక్కడి పిచ్ పరిస్థితులు తెలుసుకున్నట్లు చెప్పాడు. సీనియర్ బౌలర్లతో చర్చించి వారి నుంచి పిచ్, మ్యాచ్ కండిషన్ గురించి అవగాహనా పెంచుకున్నానని పేస్ బౌలర్ శార్దూల్ వివరించాడు. స్లో వికెట్ పిచ్ లపై బౌలర్లు మరింత శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచులలో రాణించిన ముంబై బౌలర్ విండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో 22 ఓవర్లు వేసి 50 ఇచ్చిన శార్దూల్ ఒక్క వికెట్ తీశాడు. జట్టులో అవకాశం దొరికితే సద్వినియోగం చేసుకుంటానని, తన నుంచి జట్టు చాలా భిన్నమైన బౌలింగ్ ను రాబట్టుకోవచ్చు అని శార్దూల్ పేర్కొన్నాడు. -
భారత్, విండీస్ ఎలెవన్ మ్యాచ్ డ్రా
సెయింట్ కిట్స్: విండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల మ్యాచ్ డ్రా అయింది. భారత బౌలర్లు మెరుగ్గా రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో విండీస్ జట్టు కేవలం 180 పరుగులకే చాపచుట్టేసింది. రెండో ఇన్నింగ్స్ లో 86 ఓవర్లు ఆడిన విండీస్ ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. మూడు రోజుల మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 364 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల పరుగులలోపే ఆలౌటయిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. మూడోరోజు నిర్ణీత సమయం ముగిసిపోవడంతో అంపైర్లు మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. ఓ దశలో 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన విండీస్ ను బ్లాక్‌వుడ్ (121 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు), విశాల్ సింగ్ (101 బంతుల్లో 39;5 ఫోర్లు 1 సిక్స్) ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. కార్న్‌వాల్ బ్యాటింగ్ లోనూ రాణించి 21 పరుగులు చేశాడు. హాడ్జ్ (39) కూడా ఆకట్టుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో అశ్విన్ 3 వికెట్లు పడగొట్టగా, షమీ, జడేజా చెరో వికెట్ తీశారు. రాణించిన జడేజా బౌలింగ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన తను (61 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో... విండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 364 పరుగులు చేసింది. దీంతో 184 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజా.. వృద్ధిమాన్ సాహాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు అశ్విన్ (61 బంతుల్లో 26; 4 ఫోర్లు)తో కలిసి 47 పరుగులు జోడించాడు. విండీస్ బౌలర్లలో కార్న్‌వాల్‌కు ఐదు వికెట్లు దక్కాయి. భారత్, విండీస్ ల మధ్య తొలి టెస్టు 21న ప్రారంభం కానుంది. -
జడేజా ఆల్‌రౌండ్ షో
* తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 364 * విండీస్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్‌లో 104/3 సెయింట్ కిట్స్: బౌలింగ్‌లో మూడు వికెట్లతో చెలరేగిన రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. తొమ్మిదో నంబర్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన తను (61 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించడంతో... విండీస్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడు రోజుల మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 105.4 ఓవర్లలో 364 పరుగులు చేసింది. దీంతో 184 పరుగుల ఆధిక్యం లభించింది. జడేజా.. వృద్ధిమాన్ సాహాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు, తొమ్మిదో వికెట్‌కు అశ్విన్ (61 బంతుల్లో 26; 4 ఫోర్లు)తో కలిసి 47 పరుగులు జోడించాడు. కార్న్‌వాల్‌కు ఐదు వికెట్లు దక్కాయి. అనంతరం చివరి రోజు శనివారం కడపటి వార్తలు అందే సరికి రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ ఎలెవన్ 63 ఓవర్లలో నాలుగు వికెట్లకు 154 పరుగులు చేసింది. ఓపెనర్ కాంప్‌బెల్ (59 బంతుల్లో 31; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. అయితే 70 పరుగులకే మూడు వికెట్లు పడిన దశలో బ్లాక్‌వుడ్ (121 బంతుల్లో 35 బ్యాటింగ్; 5 ఫోర్లు), విశాల్ సింగ్ (101 బంతుల్లో 39;5 ఫోర్లు 1 సిక్స్) నాలుగో వికెట్‌కు 62 పరుగులు జత చేశారు. క్రీజ్‌లో కాంప్‌బెల్‌తో పాటు హాడ్జ్ (13 బ్యాటింగ్)ఉన్నాడు. అశ్విన్‌కు రెండు, జడేజాకు ఓ వికెట్ దక్కింది.