బౌన్సర్తో వికెట్ పడగొట్టాను..
సెయింట్ కిట్స్: వెస్డిండీస్ తో టెస్ట్ సిరీస్ కు భారత జట్టుకు ఎంపికైన బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒకడు. కరీబియన్ పిచ్ లలో ఎక్కువగా స్లో బంతులకు వికెట్లు పడగొట్టొచ్చు అంటున్నాడు. అయితే తాను తీసిన వికెట్ మాత్రం బౌన్సర్ తో సాధ్యమైందన్నాడు. జూన్ 21న విండీస్ తో భారత్ తొలి టెస్టు ఆడనుంది. రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లతో లైన్ అండ్ లెంగ్త్ బంతులపై అవగాహనా పెరిగిందన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే కుప్పకూలిన విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 86 ఓవర్లు ఆడి ఆరు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.
ప్రాక్టీస్ మ్యాచ్లలో చోటు దక్కకున్నా, ఇక్కడి పిచ్ పరిస్థితులు తెలుసుకున్నట్లు చెప్పాడు. సీనియర్ బౌలర్లతో చర్చించి వారి నుంచి పిచ్, మ్యాచ్ కండిషన్ గురించి అవగాహనా పెంచుకున్నానని పేస్ బౌలర్ శార్దూల్ వివరించాడు. స్లో వికెట్ పిచ్ లపై బౌలర్లు మరింత శ్రమించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచులలో రాణించిన ముంబై బౌలర్ విండీస్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో 22 ఓవర్లు వేసి 50 ఇచ్చిన శార్దూల్ ఒక్క వికెట్ తీశాడు. జట్టులో అవకాశం దొరికితే సద్వినియోగం చేసుకుంటానని, తన నుంచి జట్టు చాలా భిన్నమైన బౌలింగ్ ను రాబట్టుకోవచ్చు అని శార్దూల్ పేర్కొన్నాడు.