![It is not easy to play one off games, says Shardul Thakur - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/19/Shardul-Thakur.jpg.webp?itok=_WUMTHrN)
లీడ్స్: ఇంగ్లండ్‌తో మంగళవారం రాత్రి జరిగిన మూడో వన్డేలో తాను ఆందోళనకి గురైనట్లు భారత ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు. సుదీర్ఘ కాలం తర్వాత వన్డే ఆడిన శార్దూల్.. మ్యాచ్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి 51 పరుగులిచ్చాడు. మ్యాచ్ మొత్తంలో భారత బౌలర్లు ఒక వికెట్ మాత్రమే పడగొట్టగా.. అది శార్దూల్ ఠాకూర్‌కే దక్కింది. ఆరంభంలోనే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన బెయిర్ స్టో.. శార్దూల్ బౌలింగ్‌లో రైనాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
‘దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది ఆరంభంలో చివరిసారిగా వన్డే మ్యాచ్ ఆడాను. ఆ మ్యాచ్‌లో భారత్ గెలుపొందింది. వాస్తవానికి అప్పటికే సిరీస్‌లో భారత్ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో.. నేను పెద్దగా ఒత్తిడికి గురవలేదు. కానీ.. ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో భారత్ తప్పక గెలవాల్సి ఉండటంతో కాస్త ఆందోళనకి గురయ్యా. ఆ మ్యాచ్‌లో జట్టు కోసం అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. అయితే.. దురదృష్టవశాత్తు మ్యాచ్‌లో ఓడిపోయాం. రిజర్వ్ బెంచ్‌పై ఉండి, ఒక్కసారిగా మ్యాచ్‌లోకి వచ్చి మెరుగైన ప్రదర్శన ఇవ్వడం అంత సులువు కాదు ’ అని శార్దూల్ ఠాకూర్ వెల్లడించాడు.
చదవండి: 637 బంతుల తర్వాత తొలి సిక్స్..!
Comments
Please login to add a commentAdd a comment