కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తుది పోరులో భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్ కళ్లు చెదిరే క్యాచ్‌తో శభాష్ అనిపించాడు. బౌండరీ లైన్‌కు కొద్దిపాటి దూరంలో మెరుపు వేగంతో క్యాచ్ పట్టి అబ్బురపరిచాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లో భాగంగా చాహల్ వేసిన ఐదో ఓవర్ రెండో బంతిని తమీమ్ భారీ షాట్ కొట్టాడు. అది కచ్చితంగా సిక్సర్ అవుతుందని సగటు క్రికెట్ అభిమాని భావించిన తరుణంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ గాల్లో ఎగిరి బంతిని అందుకున్నాడు.
అదే సమయంలో బౌండరీ లైన్‌ను తాకకుండా నియంత్రించుకోవడం హైలెట్‌గా నిలిచింది. బౌండరీ లైన్‌కు అంగుళం దూరంలో క్యాచ్‌ను శార్దూల్ అందుకున్న తీరు అబ్బురపరిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ దూకుడుగా ఆడే ప్రయత్నంలో 27 పరుగుల వద్ద లిటాన్ దాస్‌ను తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. ఆపై అదే స్కోరు వద్ద తమీమ్ కూడా వెనుదిరిగడంతో బంగ్లాదేశ కష్టాల్లో పడింది.
Comments
Please login to add a commentAdd a comment